Ukraine vs Russia: ఉక్రెయిన్‌లో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇవే.. మొదటి సినిమా ఏదంటే?

Telugu Movies Shot In Ukraine: క్రెయిన్‌లో అందమైన లోకేషన్లలో పలు భారతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ఉక్రెయిన్లో షూటింగ్ కోసం వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ సినిమా విన్న‌ర్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 11:41 PM IST
  • ఉక్రెయిన్‌లో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇవే
  • ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రోబో 2.0 వరకు
  • మొదటి సినిమా ఏదంటే?
Ukraine vs Russia: ఉక్రెయిన్‌లో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇవే.. మొదటి సినిమా ఏదంటే?

Telugu Movies Shot In Ukraine: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సుంద‌ర‌మైన ప్ర‌దేశాల్లో ఉక్రెయిన్ దేశం ఒక‌టి. అక్కడ అనేకమైన సుందర, మనోహరమైన ప్రదేశాలు ఉండడంతో నిత్యం ప‌ర్యాట‌కుల‌తో కిటకిటలాడుతుంటుంది. అలాంటి ఉక్రెయిన్ ప్రస్తుతం శవాలకు అడ్డాగా మారుతోంది. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. రష్యా సేనల బాంబు దాడుల్లో ఒకవైపు ఉక్రెయిన్ సైనిక స్థావరాలు కుప్పకూలుతుండగా.. మరోవైపు అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా సెన్సెక్స్‌ భారీగా పతనమవడంతో పాటు ప్రపంచ మార్కెట్‌ కూడా కుదేలవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు సినీ పరిశ్రమపై కూడా ప్రభావం చూపనుంది. ర‌ష్యా బ‌ల‌గాలు స‌రిహ‌ద్దుల‌ను దాటి ఉక్రెయిన్‌లోకి ప్ర‌వేశించి దాడులు చేస్తుండ‌టంతో అక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలు ధ్వంసమవుతున్నాయి. దాంతో భారత సినీ ప్రముఖులు కొందరు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో అందమైన లోకేషన్లలో పలు భారతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకొనడమే అందుకు కారణం. ఆ సినిమాలు ఏవో ఓసారి చూద్దాం. 

ఆర్‌ఆర్‌ఆర్‌:
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. 'నాటు నాటు' సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీక‌రించారు. గత ఆగస్టులో ఆర్‌ఆర్‌ఆర్‌ చివరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్‌ వెళ్లింది. 

రోబో 2.0:
సెన్సెషన్‌ డైరెక్టర్‌ శంకర్‌, సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'రోబో'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0లోని కొన్ని  సన్నివేశాలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. ఓ పాటను అక్కడే తీశారు.

విన్న‌ర్:
సాయిధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా 2017లో వ‌చ్చిన విన్న‌ర్ సినిమా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. అంతేకాదు అక్కడ షూటింగ్ కోసం వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ చిత్ర‌మిదే. ఈ విషయాన్ని డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

దేవ్‌:
తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రజత రవి శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవ్‌'. రొమాంటిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌గా రూపొందించిన ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను 2018లో ఉక్రెయిన్‌లో తీశారు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.

99 సాంగ్స్:
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ స‌హ నిర్మాత‌గా తెర‌కెక్కించిన '99 సాంగ్స్' సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకుంది. ఇండియాలో మొద‌లైన ఈ మూవీ షూటింగ్‌.. ఉక్రెయిన్‌ షెడ్యూల్‌తో ముగిసింది. ఈ సినిమాలో ఇహాన్‌ భ‌ట్‌, ఎడిల్సీ వ‌ర్గాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read: IPL 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ 2022కు ముహూర్తం ఖరారు! ప్రేక్షకులకు అనుమతి!!

Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News