ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా!

Last Updated : May 5, 2018, 03:12 PM IST
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా! ముఖం ఎక్కడో చూసినట్లు ఉందనిపిస్తోంది కదూ..! ఆయన ఎవరో కాదు బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్‌సింగ్. ‘పద్మావత్‌’లో అల్లాఉద్ధీన్‌ ఖిల్జీ పాత్ర పోషించిన ర‌ణ్‌వీర్‌ సింగే ఇతడు. ర‌ణ్‌వీర్‌ సినిమాల్లోనే కాదు బయట కూడా చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో కనిపిస్తుంటుంటాడు. ఇదిగో ఇప్పుడు ఇలా చార్లీ చాప్లిన్‌లా మారిపోయాడు.

ఇంతకీ విషయం ఏంటంటే రణ్‌వీర్‌ నటిస్తున్న 'గల్లీబాయ్' షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. పనిలో పనిగా అక్కడి టూరిస్ట్ ప్రదేశాలను రణ్‌వీర్ తిరిగేస్తున్నాడు‌. అందులో భాగంగానే 'చార్లీ చాప్లిన్‌' మ్యూజియమ్‌ను సందర్శించాడు. ఇంకేం.. ఇక ఆలస్యం చేయకుండా చాప్లిన్‌లా గెటప్‌ మార్చి ఓ నాలుగైదు ఫోజులిచ్చి సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను పంచుకున్నాడు. రణ్‌వీర్‌ స్విట్జర్లాండ్‌ పర్యాటకరంగానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా. 

 
 

“A day without laughter is a day wasted” - Charlie Chaplin #ChaplinsWorld #inLOVEwithSWITZERLAND @chaplins.world @montreuxriviera @myswitzerlandin @myvaud

A post shared by Ranveer Singh (@ranveersingh) on

 

 

 

Trending News