Free OTT Movies : ఫ్రీగా ఈ ఓటీటీల్లో సినిమాలు చూసేయండి.. ఎంజాయ్ పండుగో అంటే ఇదే

Free OTT Movies ప్రస్తుతం జనాలంతా కూడా ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. థియేటర్లకు అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు ఆడియెన్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 04:17 PM IST
  • పెరిగిన ఓటీటీల వాడకం
  • ఓటీటీల్లో ఉచితంగా సినిమాలు
  • వూట్,జియో, ఎంఎక్స్ ప్లేయర్ల హవా
Free OTT Movies : ఫ్రీగా ఈ ఓటీటీల్లో సినిమాలు చూసేయండి.. ఎంజాయ్ పండుగో అంటే ఇదే

Free OTT Movies : ఫ్రీగా సినిమాలు చూసేందుకు ఇప్పుడు ఎన్నో దారులున్నాయి. థియేటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకునేందుకు ఆడియెన్స్ రెడీగా లేరు. తమకు నచ్చిన, మెచ్చిన చిత్రాలను మాత్రమే థియేటర్లో చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. లేదంటే తాపీగా ఓటీటీల్లోకి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నారు. అందులోనూ ఫ్రీగా సినిమాలను చూసేందుకు దారులు వెతుక్కుంటున్నారు. మూవీ రూల్జ్, ఐబొమ్మ వంటి వాటిల్లో ఫ్రీగా సినిమాలు చూస్తుంటారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం ఫ్రీగా సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

అందులో ఎంఎక్స్ ప్లేయర్ ఒకటి. పన్నెండు భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఎంఎక్స్ ఒరిజినల్స్.. చీజ్ కేక్, క్వీన్, పండు వంటి షోలోను చూడొచ్చు. ఇందులోని ఎన్నో షోలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక టుబి అనే ఓటీటీలోనూ ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ మూవీలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. హెచ్ డీ క్వాలిటీలో షోలు, సినిమాలు ఇందులో చూడొచ్చు.

ప్లెక్స్‌ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మూవీస్, టీవీ షోలు కాకుండా.. 200 లైవ్ చానెల్స్ ఇందులో చూసుకోవచ్చు. హిందీ కంటెంట్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వూట్‌ సంస్థలో అయితే కలర్స్ టీం, ఎం టీవీకి సంబంధించిన కంటెంట్ అంతా అందులో ఉంటుంది. ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. ఇందులో ఎక్కువగా యాడ్స్ వస్తుంటాయి. ప్రీమియం కంటెంట్ కావాలంటే మాత్రం సబ్ స్రిప్షన్ తీసుకోవాల్సిందే. 

జియో సినిమా యాప్ నుంచి సినిమాలు, టీవీ సిరీస్‌లు వీక్షించేందుకు వీలుంది. హిందీ కంటెంట్ ఎక్కువగా ఇందులో ఉంటుంది. టీవీ చానెళ్లను కూడా ఇందులో చూడొచ్చు. అయితే దీని కోసం రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read : Janhvi Kapoor Diwali Pics : ఉబికివస్తోన్న జాన్వీ కపూర్ అందాలు.. తెరిచిపెట్టేసిన కియారా అద్వానీ

Also Read : Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News