w/o రామ్ ట్రైలర్ చూసి ఫిదా అయిన రాజమౌళి

w/o రామ్ ట్రైలర్ చూసి ఆశ్చర్యానికి గురైన రాజమౌళి

Last Updated : Jun 12, 2018, 12:26 PM IST
w/o రామ్ ట్రైలర్ చూసి ఫిదా అయిన రాజమౌళి

మంచు లక్ష్మీ నటించిన అప్‌కమింగ్ సినిమా w/o రామ్ ట్రైలర్ చూసి ఆశ్చర్యానికి గురైన రాజమౌళి.. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని ట్వీట్ చేశారు. విజయ్ యెలకంటి అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఈ ట్రైలర్ చూసిన రాజమౌళి.. తొలి సినిమాతోనే సరికొత్త థ్రిల్లర్ సినిమాను ఎంచుకున్నందుకు దర్శకుడు విజయ్ యెలకంటిని అభినందించారు. ఈ సందర్భంగా w/o రామ్ మూవీ యూనిట్‌కి విజయం కలగాలని ఆశిస్తూ వారికి రాజమౌళి గుడ్ లక్ చెప్పారు. లక్ష్మీ మంచు, ఆదర్శ్, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన w/o రామ్ సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. మంచు లక్ష్మి నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. 

 

తన భర్తను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా, ఆ నిందితులు ఎవరో పట్టుకునేందుకు తానే స్వయంగా డిటెక్టివ్‌గా మారి తన భర్తను హత్య చేసిన హంతకులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యే మహిళ పాత్రలో లక్ష్మి మంచు నటించినట్టు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. అయితే, w/o రామ్ ఆడియెన్స్ ముందుకు వస్తే కానీ ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో అసలు నిందితులు ఎవరో తెలిసే ఛాన్స్ లేదు. 

Trending News