Tollywood హీరో విశ్వంత్‌పై చీటింగ్ కేసు.. ఖరీదైన మోసం అంటూ ఆరోపణలు!

Viswant Duddumpudi: Cheating Case Filed Against Tollywood Actor Vishwant: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్‌‌పై ఛీటింగ్ కేసు నమోదైంది. నటుడు విశ్వంత్ దుద్దుంపూడి తమను నమ్మించి మోసం చేశాడని అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకే పలువురు బాధితులు ఆరోపణలు చేయగా, తాజాగా ఫిర్యాదు చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 20, 2021, 11:48 AM IST
  • టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్‌‌పై ఛీటింగ్ కేసు నమోదైంది
  • తమను నమ్మించి మోసం చేశాడని అందిన ఫిర్యాదులు
  • తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Tollywood హీరో విశ్వంత్‌పై చీటింగ్ కేసు.. ఖరీదైన మోసం అంటూ ఆరోపణలు!

Viswant Duddumpudi: Cheating Case Filed Against Tollywood Actor Vishwant: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్‌‌పై ఛీటింగ్ కేసు నమోదైంది. విశ్వంత్ దుద్దుంపూడి తమను నమ్మించి మోసం చేశాడని అందిన ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకే పలువురు బాధితులు ఆరోపణలు చేయగా,  పోలీసులను ఆశ్రయించి మోసాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా అభిమానులు, ప్రేక్షకులు ఫాలో అవుతుంటారు. వారి మాటలు సైతం అంతగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని విశ్వంత్ తమను నమ్మించాడని బాధితులు తెలిపారు. తక్కువ ధరలకు కార్లు ఇప్పించేందుకు తమ వద్ద హీరో విశ్వంత్ డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. 

Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

విశ్వంత్ చెప్పినట్లుగా తాము అతడికి డబ్బులు ఇచ్చామని, అయితే కార్లు మాత్రం తమకు ఇప్పించలేదని వాపోయారు. కార్లు ఇప్పించకపోగా, తమ డబ్బు సైతం తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని బంజారాహిల్స్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.

Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి

కాగా, దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమా ద్వారా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. మనమంత, తోలు బొమ్మలాట సినిమాల్లో నటించాడు. గతేడాది విడుదలైన పిట్టకథ సినిమాలో మెయిన్ రోల్ పోషించాడు విశ్వంత్. పలు సినిమాల్లో నటించిన విశ్వంత్ నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఛీటింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Also Read: Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News