Vijay - Goat: యావరేజ్ టాక్ తో విజయ్ ‘గోట్’ మూవీ మరో రేర్ రికార్డు.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..!

Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో  విజయ్ కు  సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఈయన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర వచ్చిన వసూల్లు మాములుగా లేవు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 21, 2024, 07:55 AM IST
Vijay - Goat: యావరేజ్ టాక్ తో విజయ్ ‘గోట్’ మూవీ  మరో రేర్ రికార్డు.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..!

Vijay Goat closing collections: వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ చిత్రం విడుదల వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ తర్వాత ఎక్కువగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. తెలుగు, కేరళ, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఇక తెలుగులో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. కానీ తమిళ తంబీలు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ లో తమిళ వెర్షన్ లో  ఈ సినిమా ఊచ కోత కోసింది.  ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీకి ప్రీ మేక్ అని టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ సునామి క్రియేట్ చేసింది. మొత్తంగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము రేపింది.

మొత్తంగా మూడు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా ఏ మేరకు రాబట్టిందనే విషయానికొస్తే.. తెలుగులో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.5 కోట్ల షేర్ (రూ. 13.05 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్ గా రూ. 15 కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చింది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తమిళనాడు..రూ. 217.75 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి.. రూ. 13.05 కోట్లు..
కర్ణాటక.. రూ. 27.95 కోట్లు..  
కేరళ.. రూ. 13.30 కోట్లు..
రెస్ట్ ఆఫ్ భారత్ -- రూ. 24.35 కోట్లు..
ఓవర్సీస్ .. 156.65 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 454.05 కోట్ల గ్రాస్ (రూ.221.65 కోట్ల షేర్)వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. రూ. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగి ఓవరాల్ గా రూ. 221.65 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా రూ. 34 కోట్ల మేర నిర్మాతకు లాభాలను తీసుకొచ్చింది.

‘గోట్’ చిత్రంలో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసాడు. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘సర్కార్’, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు ఆ తర్వాత లియో చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి.  తాజాగా ‘గోట్’ మూవీ విజయ్ కెరీర్ లో రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 8వ మూవీగా రికార్డులకు ఎక్కింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏకంగా 8 చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించలేదు. మొత్తంగా లియో, గోట్ చిత్రాలు రూ. 400 కోట్ల క్లబ్బులో ప్రవేశించడం విశేషం. తెలుగులో మరే హీరోకు ఈ ఘనత దక్కించుకోలేదు.  మొత్తంగా ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్,కల్కి కలిపితే ఆరు చిత్రాలే రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. అటు రజనీకాంత్ చిత్రాలు ఆరు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించి కొత్త రికార్డు క్రియేట్ చేశాయి.  కానీ విజయ్ నటించిన ‘గోట్’తో కలిపితే మొత్తంగా 8 చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News