Vijay Krishna Ganaa Movie Review విజయ్ కృష్ణ గణా మూవీ నేడు (మార్చి 17) థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాతో హీరోగా విజయ్ కృష్ణ దర్శకుడిగానూ మెప్పించే ప్రయత్నం చేశాడు. మరి ఈ గణా సినిమా కథ కథనాలు ఏంటి? సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించింది అన్నది చూద్దాం.
కథ
వైజాగ్ పోర్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోర్ట్‌ను అడ్డం పెట్టుకుని మినిస్టర్ కోటేశ్వరరావు డ్రగ్స్, ఇల్లీగల్ దందా చేస్తుంటాడు. ఇక ఈ డ్రగ్స్ దందాను గణా (విజయ్ కృష్ణ) ఏలుతుంటాడు. మినిస్టర్‌కు అడ్డు వచ్చాడని వోడ్కా దాస్ (నాగ మహేష్)ను గణా చంపేస్తాడు. దీంతో అతని తమ్ముడు దాము, ఎక్స్ ఎమ్మెల్యే అంతా కలిసి గణాను కట్టడి చేయాలని చూస్తారు. ఈ క్రమంలో గణా డాక్టర్ సౌమ్య (యోగిష)తో ప్రేమలో పడతాడు. యోగిష తండ్రి పోలీస్ ఆఫీసర్‌ని చంపే కాంట్రాక్ట్ గణాకు వస్తుంది. గణా చేయని నేరానికి సౌమ్య అపార్థం చేసుకుంటుంది. అసలు గణా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? గణా గతంలో ఉన్న ప్రియ (తేజు) ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు? గణా చివరకు ఏం చేశాడు? అన్నది కథ.
నటీనటులు
గణా పాత్రలో విజయ్ కృష్ణ మెప్పిస్తాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తాడు. ఇక నటించడం మాత్రమే కాకుండా మిగిలిన శాఖలను కూడా చూసుకున్న విజయ్ కృష్ణ ప్రతిభ తెరపై కనిపిస్తుంది. హీరోయిన్లుగా కనిపించిన యోగిష, తేజులు పర్వాలేదనిపిస్తారు. సాంగ్స్‌లో మరింత అందంగా కనిపిస్తారు. విలన్లుగా కనిపించిని మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే, వోడ్కా దాస్ (నాగ మహేష్), దాము వంటి పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రభు చేసిన పోలీస్ పాత్ర కూడా అందరినీ మెప్పిస్తుంది. జబర్దస్త్ అప్పారావ్, దొరబాబుల కామెడీ కూడా ఓకే అనిపిస్తుంది.
విశ్లేషణ
గణా సినిమా ఎక్కువగా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్ చుట్టూనే తిప్పాడు. డ్రగ్స్ దందా, అందులోని రాజకీయాలు, పోర్టును ఆధారపడి బతికే వారి జీవన శైలి ఎలా ఉంటుందో చూపించారు. వైజాగ్, కాకినాడ, యానం చుట్టు పక్కల చిత్రీకరించిన సన్ని వేశాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి. గణా అసలు రౌడీనా? హీరోనా? అనే ప్రశ్న తలెత్తేలా నడిచే ప్రథమార్థం చకచకా వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది.
ద్వితీయార్థంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్వాలేదనిపిస్తుంది. అయితే పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చినా కూడా తెరపై అది అంతగా ఎలివేట్ అయినట్టు అనిపించదు. సీన్లకు సీన్లకు మధ్య ఏదో వెలితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కథ, కథనాలను, అందులోని ఎమోషన్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తుంది.
అయితే తెరపై మాత్రం సినిమా చూస్తున్నంత సేపు కెమెరా పనితనం కనిపిస్తుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు అక్కడకక్కడా పేలుతాయి. నిడివి తక్కువ ఉండటం సినిమాకు కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ 2.5
Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook