Vijay Deverakonda Fans: సమంతపైనే లైగర్ ఫ్యాన్స్ ఆశలు.. అంతా ఆమె చేతుల్లోనే?

Vijay Devarakonda Fans Hopes on Samantha Ruthprabhu for Kushi: లైగర్ డిజాస్టర్ తో బాధలో ఉన్న విజయ్ అభిమానులు ఆశలు అన్నీ సమంత మీదే పెట్టుకున్నారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 09:09 PM IST
Vijay Deverakonda Fans: సమంతపైనే లైగర్ ఫ్యాన్స్ ఆశలు.. అంతా ఆమె చేతుల్లోనే?

Vijay Devarakonda Fans Hopes on Samantha Ruthprabhu for Kushi: విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన తాజా చిత్రం లైగర్ ప్రేక్షకులను నిరాశ పర్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో మొదటి ఆట నుంచి సినిమాకు డివైడ్ లాగా వచ్చింది. ఒక రకంగా చూస్తే విజయ్ దేవరకొండ కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో చాలా బాధపడుతున్నారు.

అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఎంత బాధ ఉన్నా బయటికి కనపడకుండా ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తనను అనకొండ అని అభివర్ణిస్తూ కామెంట్స్ చేసిన హిందీ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ ను కలిసి వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత ఇండియా -పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్న దుబాయ్ వెళ్లి అక్కడ కూడా లైగర్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఈ హడావిడి తగ్గిన తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తదుపరి షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు షెడ్యూల్ పూర్తి కాగా మరో షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ ఖుషి సినిమాలో సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటిస్తోంది. లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా తమ దృష్టిని అక్కడి నుంచి ఖుషి సినిమా మీదకు మరల్చారు. సమంతకు ఎలాంటి సినిమా నైనా హిట్ చేస్తుందనే పేరు ఉంది. మజిలీ లాంటి చిన్న సినిమాని కూడా సమంత తనదైన మ్యాజిక్ తో సూపర్ హిట్ అయ్యేలా చేసింది. అదే విధంగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకి కూడా సమంత ఫ్యాక్టర్ కలిసి రావాలని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుతున్నారు. సమంత మ్యాజిక్ వర్కౌట్ అయితే విజయ్ దేవరకొండకు మరో హిట్టు పడుతుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఖుషి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ డైరెక్ట్ చేస్తాడని పేరు ఉన్న శివా నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు విజయ్ అభిమానులు. చివరిగా శివ టగ్ జగదీష్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా అటు విజయ్ దేవరకొండకు ఇటు శివా నిర్వాణ ఇద్దరికీ కూడా చాలా కీలకమైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా డిసెంబర్ 22లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గెట్ రెడీ!

Also Read; Pooja Hegde Hot Pics: పూజా హెగ్డే హాట్ ట్రీట్.. బుట్టబొమ్మ వాటినే టార్గెట్ చేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News