Vijay Devarakonda and Samanth enjoying at Turkey: విజయ్ దేవరకొండ, సమంతలు ఇప్పుడు ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్నందుకు ఖుషి సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. సమంత కోసం ఐదారు నెలలు షూటింగ్ ఆపేసిన విషయం విదితమే. సమంతకు మళ్లీ ఆరోగ్యం సెట్ అయన తరువాత షూటింగ్‌ను మొదలుపెట్టారు. కేరళ, కాశ్మీర్ అందాల్లో షూటింగ్‌ను చేసిన సంగతి తెలిసిందే.
ఖుషీ టీం ఇప్పుడు టర్కీలో సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ, సమంతలు టర్కీలో సందడి చేస్తున్నారు. అయితే మామూలుగా విజయ్ దేవరకొండ ఎక్కడికైనా వెళ్తే.. ఆ దేశపు ఫుడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తుంటాడు. స్థానికంగా దొరికే ఆహారాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ టర్కీ ఫుడ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ ఇలా ఫుడ్డు మీద పడితే.. సమంత మాత్రం నేచర్‌ను ఆస్వాధిస్తోంది.
ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తారని జనాలు అనుకున్నారు. కానీ ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. ఫుడ్‌ను ఆస్వాధిస్తూ విజయ్.. నేచర్‌ను ఆస్వాదిస్తూ సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఇక మాలీవుడ్ ఏఆర్ రెహ్మాన్‌గా పేరు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
ఇప్పటికే రిలీజ్ చేసిన పాట అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా మీద మరింతగా హైప్ పెరిగినట్టు అయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి కల్లా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి లైగర్ తరువాత విజయ్‌కి, టక్ జగదీష్ తరువాత శివ నిర్వాణకి, శాకుంతలం తరువాత సమంతకు ఇలా అందరికీ ఖుషి సినిమానే దిక్కైంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook