Victory Venkatesh: వెంకీమామ షాకింగ్ నిర్ణయం.. ఇక నుంచి సినిమాలకు దూరం.. కారణం ఇదేనా..

Victory Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండనున్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే...  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 09:17 AM IST
Victory Venkatesh: వెంకీమామ షాకింగ్ నిర్ణయం.. ఇక నుంచి సినిమాలకు దూరం.. కారణం ఇదేనా..

Victory Venkatesh: టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. అందరి హీరోల ఫ్యాన్స్ వెంకీమామ ఫ్యాన్స్ అనే చెప్పాలి. క్లాస్, మాస్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా ఏ పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోతారు వెంకీ (Daggubati Venkatesh). సీనియర్ హీరోల్లో ఎక్కువ హిట్ పర్సేంటేజ్ ఉన్నది వెంకీకనే చెప్పాలి. ఎప్పుడు యమ యాక్టివ్ ఉండే వెంకీమామ కుర్రహీరోలతో పోటీపడి నటిస్తూ ఉంటారు. 

ఇటీవల కాలంలో ఆయన నటించిన దృశ్యం 2, నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన ఓ పక్క సోలో హీరోగా చేస్తూనే.. మరోపక్క మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి 'ఓరి దేవుడా' చిత్రంలో సందడి చేశారు వెంకటేష్. మరో పక్క సల్మాన్ ఖాన్ చిత్రంలోనూ అతిథి పాత్ర చేస్తున్నారు. త్వరలో రానాతో కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. 

అయితే తాజాగా వెంకటేష్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సీనియర్ హీరో కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజులపాటు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నట్లు సమాచారం. అందుకే వెంకీ గత కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్‌కీ ఓకే చెప్పలేదట. మరి ఈ వార్తల్లో నిజమెంత తెలియాల్సి ఉంది. 

Also Read: Daggubati Family: ఎమ్మెల్యేలకు ఎర కేసులో చిక్కుకున్న వ్యక్తికీ దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య లావాదేవీలు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News