Actor Shivaram: సినీ పరిశ్రమలో మరో విషాదం...సీనియర్ నటుడు శివరామ్ మృతి..

Shivaram: దాదాపు ఆరు దశాబ్దాలపాటు కన్నడ ప్రేక్షకులను అలరించిన నటుడు, నిర్మాత, దర్శకుడు శివరామ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు నటీనటులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 06:44 PM IST
  • కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం
  • సీనియర్ నటుడు శివరామ్ మృతి
  • పలువురు ప్రముఖులు సంతాపం
Actor Shivaram: సినీ పరిశ్రమలో మరో విషాదం...సీనియర్ నటుడు శివరామ్ మృతి..

Kannada actor Shivaram passes away: ప్రముఖ కన్నడ నటుడు శివరామ్ (83) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ హెమరేజ్‌తో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్(Kannada actor Shivaram) కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్రెయిన్​లో బ్లీడింగ్​ అయినట్లు తేలింది. ఆయన వయసు కారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేయలేకపోయారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్​ను డాక్టర్లు బతికించలేకపోయారు.

దాదాపు ఆరు దశాబ్దాల సినీ కెరీర్ లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శివరామ్. 1965 సినిమాలో 'బేరత జీవా' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 90కి పైగా సినిమాల్లో నటించారు. తన సోదరుడు ఎస్.రామనాథన్​తో కలిసి పలు సినిమాలను నిర్మించారు శివరామ్. 

Also Read: Kamal Haasan discharge: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కమల్...ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

1972లో 'హదయ సంగమ'.. శివరామ్​కు నిర్మాతగా తొలి సినిమా. అలానే 1985లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'గిరఫ్తార్' నిర్మించింది ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్​హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్​కుమార్ లైఫ్​టైమ్ అచీవ్​మెంట్​ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్​కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు ఈయనను వరించింది.

శివరామ్ మృతిపట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(Karnataka Chief Minister Basavaraj Bommai) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీరని లోటుని ఆయన అన్నారు. ఈయన మృతికి పలువురు ప్రముఖలు ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News