Heat Movie Review : హీట్ కథ, కథనాలు ఏంటంటే?.. పరుగులుపెట్టించిన డైరెక్టర్

Heat is On Movie Review వర్దన్ గుర్రాల స్నేహా ఖుషి కాంబోలో వచ్చిన చిత్రం హీట్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథ, కథనాలు ఏంటన్నది ఓ సారి చూద్దాం. ఆడియెన్స్‌ను అసలు మెప్పిస్తుందా? అన్నది ఓ లుక్కేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 08:29 AM IST
  • థియేటర్లోకి వచ్చిన హీట్
  • పరుగులు పెట్టించేసిన మేకర్లు
  • హీట్ కథ, కథనాలు ఏంటంటే?
Heat Movie Review : హీట్ కథ, కథనాలు ఏంటంటే?.. పరుగులుపెట్టించిన డైరెక్టర్

Heat is On Movie Review సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే సినిమాలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ క్రమంలోనే హీట్ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ శుక్రవారం గట్టి పోటీ ఉన్న తరుణంలోనే ఈ సినిమా కూడా థియేర్లోకి వచ్చింది. మరి ఈ హీట్ కథ ఏంటి? కథనం ఎలా సాగింది? సినిమాను జనాలు ఆదరిస్తారా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
అభి (వర్దన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి)లు మంచి స్నేహితులు. సొంతంగా కంపెనీని నడుపుతూ ఉంటారు. మలేషియన్ ప్రాజెక్ట్‌ విషయంలో స్టీఫెన్ అనే వ్యక్తితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే క్రమంలో సిరిల్ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి) చర్చిలో పెళ్లి చేసుకుంటాడు. కులాంతర మతాంతర వివాహాం కావడంతో ఆరాధ్య అన్న రుద్ర రగిలిపోతోంటాడు. వారిని చంపేయాలని అనుకుంటాడు. ఈక్రమంలోనే సిరిల్, ఆరాధ్యలు కనిపించకుండాపోతాడు. దీంతో అభి చేసిన తన స్నేహితుల కోసం చేసిన ప్రయత్నాలేంటి? అభికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ మైఖెల్ అనే వ్యక్తి ఎవరు? అతని వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.

నటీనటులు
అభి, సిరిల్, మైఖెల్, ఆరా ఇలా నాలుగు పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఇందులో అభి సినిమా అంతా పరుగులు పెడుతూనే ఉంటాడు. స్నేహితుడ్ని కాపాడుకునే ప్రయత్నంలో అభి నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తాడు. సిరిల్ కథ పరంగా ఆ పాత్రకు ఓకే అనిపిస్తాడు. హీరోయిన్లైన స్నేహా ఖుషి, అంబికా వాణిలు ఆకట్టుకుంటారు. ఇక మైఖెల్‌గా సైక్,శాడిస్ట్ పాత్రలో వంశీ రాజ్‌ పర్వాలేదనిపిస్తాడు. ఇలా మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ
సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లు ఎప్పుడూ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు ఇష్టమే. అయితే ఇలాంటి కథల్లో ఓ సైకో శాడిస్ట్ కారెక్టర్ ఉంటుంది.. హీరో హీరోయిన్లకు అతడి వల్ల సమస్యలు వస్తాయి.. అయితే సైకో కారెక్టర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే విధానం, సైకో పాత్రకు ఉండే ఫ్లాష్ బ్యాక్ ఇలా అన్నీ కూడా కామన్‌.ఇలాంటి సినిమాలకు కామన్‌గా ఉండే పాయింట్ అదే.  కానీ వాటిలో కథ, కథనం ఏమైనా కొత్తగా ఉంటుందా? అని జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. 

హీట్ సినిమా కథ, కథపరంగా ఎక్కువగా కొత్తదనం కనిపించదు. చకచకా సీన్లు పరిగెత్తినట్టుగా అనిపిస్తుండటంతో.. బోర్ ఫీలింగ్ కూడా రాకపోవచ్చు. అలా కథనాన్ని పరిగెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ప్రథమార్థం మొత్తం సస్పెన్స్‌గా సాగుతుంది.. మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయ్.. అవి చేసింది ఎవరు? హీరోని ఎందుకు ఇరికిస్తున్నారు వంటి ప్రశ్నలు తలెత్తి ప్రేక్షకుల్ని సినిమాలో నిమగ్నమయ్యేలా చేయడంలో దర్శకుడు సఫలమైనట్టు అనిపిస్తుంది.

Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ

ద్వితీయార్థంలో సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టును జనాలు ముందే పసిగట్టే చాన్స్ ఉంది. విలన్ మీద హీరో గెలుస్తాడు. క్లైమాక్స్ అందరికీ తెలిసినట్టుగానే ముగుస్తుంది. ఇక సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. ఆర్ఆర్ అక్కడక్కడా సీన్లను ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా అంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. నైట్ విజువల్స్‌ను కెమెరామెన్ బాగానే చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ 2.5

Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News