Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ నెలలో విడుదలైన మగువా మగువా సాంగ్ ( Maguva Maguva song ) అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Last Updated : Aug 28, 2020, 10:33 PM IST
Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ నెలలో విడుదలైన మగువా మగువా సాంగ్ ( Maguva Maguva song ) అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతో కాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండటంతో ఈ మోషన్ పోస్టర్‌ని వారి అంచనాలకు తగినట్టుగా టీజర్‌ ట్రీట్‌కి ( Vakeel saab teaser ) సమానంగా ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కూడా తన ట్విట్ట్వర్‌లో “WED-NES-DAY” అని ట్వీట్ చేసి అభిమానులకు హింట్ ఇచ్చాడు. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

వకీల్ సాబ్ సినిమా ( Vakeel Saab ) బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన  ‘పింక్’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ లీగల్ డ్రామాలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నాడు. ఎంసీఏ మూవీ ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్ల నటిస్తున్నారు. Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

Trending News