"ఉన్నది ఒకటే జిందగీ" వీకెండ్ కలెక్షన్

Last Updated : Oct 31, 2017, 05:52 PM IST
"ఉన్నది ఒకటే జిందగీ" వీకెండ్ కలెక్షన్

రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఉన్నది ఒకటే జిందగీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో (శుక్ర, శని, ఆదివారం) 9 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఉన్నది ఒకటే జిందగీ.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ, లావణ్య హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మూవీలో ఎమోషన్స్ అద్భుతంగా పండడంతో సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అటు ఓవర్సీస్ లో కూడా ఉన్నది ఒకటే జిందగీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Trending News