Breaking news: పోసాని ఇంటిపై రాళ్లదాడి..అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు

Posani Krishna Murali: సీనియర్‌ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లదాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమీర్‌పేట్‌ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై రాళ్లదాడి చేసి పరారయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 01:00 PM IST
  • పోసాని ఇంటిపై రాళ్లదాడి
  • అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు
  • ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
Breaking news: పోసాని ఇంటిపై రాళ్లదాడి..అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు

Posani Krishna Murali: పవన్ వర్సెస్ పోసాని మధ్య వార్ కొనసాగుతోంది. సీఎం జగన్‌, ఏపీ ప్రభుత్వంపై పవన్(Pawan Kalyan) చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో పోసాని ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోసాని ఇంటి(Posani House)పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి  చేశారు. అమీర్‌పేట్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లు విసిరారు. పోసాని(Posani Krishna Murali)ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్‌మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. గత ఎనిమిది నెలలుగా పోసాని కుటుంబం(Posani Family) అక్కడ ఉండటం లేదు. వేరే చోట నివాసముంటున్నారు. ఘటనపై పోసాని వాచ్‌మెన్  సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంమైంది.

Also Read: Posani Krishna Murali: 'పవన్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు పెడుతున్నారు'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News