Actress Tunisha Sharma Died by Hanging Herself: హిందీ టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది, యువ నటి 20 ఏళ్ల తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్ లోని టీ బ్రేక్ సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన తునీషా ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఈ విషయం బయటకు వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో తునీషా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు షూటింగ్ నిర్వాహకులు గుర్తించారు.
తునీషా శర్మ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. తునీషా శర్మ వయసు కేవలం 20 ఏళ్లు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, ఆమె 'అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్' సీరియల్ కోసం షూటింగ్ చేస్తోంది. ఆమె తన సహనటుడి మేకప్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఒకరితో ప్రేమలో ఉందని తాజాగా బ్రేకప్ అయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాక తునీషా కొన్ని గంటల క్రితం ఇన్‌స్టా స్టోరీలో ఒక వీడియోను కూడా పంచుకుంది, అందులో ఆమె సెట్‌లో మేకప్ వేసుకోవడం, అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడటం కనిపించింది. తునీషా శర్మ చారిత్రాత్మక షో భారత్ కా వీర్ పుత్ర: మహారాణా ప్రతాప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆ ఒక్క సీరియల్ మాత్రమే కాకుండా, ఆమె చక్రవర్తి అశోక్ సామ్రాట్, గబ్బర్ పూచ్వాలా, షేర్-ఎ-పంజాబ్: మహారాజ్ రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్ మరియు ఇష్క్ సుభాన్ అల్లా వంటి సీరియల్స్ లో కూడా నటించింది. తునీషా శర్మ కేవలం టీవీ సీరియల్స్ లో మాత్రమే కాక సినిమాల్లోనూ సత్తా చాటింది. ఆమె 'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2: దుర్గా రాణి సింగ్' మరియు 'దబాంగ్ 3' వంటి సినిమాల్లో నటించింది.
ఇక తునీషా 'ఫితూర్' సహా 'బార్ బార్ దేఖో' చిత్రాల్లో కత్రినా కైఫ్ చిన్ననాటి పాత్రలు పోషించింది. అలాగే ఆమె సల్మాన్ ఖాన్ - సోనాక్షి సిన్హాల దబాంగ్ 3 లో కూడా నటించింది. తునీషా ఆత్మహత్యపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు వనెత్తారు. తునీషా అకస్మాత్తుగా ఇంత పెద్ద అడుగు వేయడానికి కారణం ఏమిటి? తునీషాకి ఏ సమస్య వచ్చింది? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక తునీషా ఆత్మహత్యకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశం ఉంది.
Also Read: ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో ఆరుగురు మహిళలు.. అప్పటి నిజం బయటపెట్టిన వెంకయ్యనాయుడు
Also Read: ఒంగోలులో వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్..ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.