Keerthy Suresh Lover : ప్రేమలో కీర్తి సురేష్‌.. కాబోయే వరుడు అతనే.. ఇంత మ్యాటర్ జరిగిందా?

Keerthy Suresh Marriage Details మహానటి కీర్తి సురేష్‌ ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆమె ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు.. ఇలాంటి రూమర్లు బయటకు వచ్చేస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 06:59 AM IST
  • కీర్తి సురేష్‌ ప్రేమ వ్యవహారంపై చర్చలు
  • చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో మహానటి
  • నాలుగేళ్ల తరువాతే పెళ్లి తంతు ఉంటుందా?
Keerthy Suresh Lover : ప్రేమలో కీర్తి సురేష్‌.. కాబోయే వరుడు అతనే.. ఇంత మ్యాటర్ జరిగిందా?

Keerthy Suresh Marriage Details మహానటి కీర్తి సురేష్‌కు ఇప్పుడు టైం బాగా లేనట్టుగా కనిపిస్తుంది. ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. మహానటి తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. సర్కారు వారి పాటలో కాస్త కొత్తగా, బోల్డ్‌గా నటించింది. కానీ ఈ చిత్రం అంత పెద్ద విజయం ఏమీ సాధించలేదు. ఇక తమిళంలోంచి తెలుగులోకి డబ్ అయిన చిన్ని సినిమాలో కీర్తి సురేష్‌ నటనకు అంతా ఫిదా అయ్యారు.

కీర్తి సురేష్‌ ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగా లేకపోయినా.. ఇప్పుడు మాత్రం పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. కీర్తి సురేష్‌ బాయ్ ఫ్రెండ్, లవర్, పెళ్లి గురించి ఎప్పుడూ చర్చలు వస్తూనే ఉంటాయి. కీర్తి సురేష్‌, అనిరుధ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కీర్తి సురేష్‌ తన చిన్ననాటి స్నేహితుడితోనే ప్రేమలో ఉన్నారని, అతను కేరళలో హోటల్ బిజినెస్ చేస్తాడని, గత పదమూడేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, ఇంకో నాలుగేళ్ల తరువాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎంత నిజం ఉన్నదో తెలియడం లేదు గానీ.. మహానటి పెళ్లి వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.

మహానటి కీర్తి సురేష్‌ ఇప్పుడు తెలుగులో నాని హీరోగా రాబోతోన్న దసరా సినిమాతో మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ చిత్రం పూర్తిగా నేచురల్‌ లుక్‌లోనే కీర్తి సురేష్‌ కనిపించబోతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిచారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లతో కీర్తి సురేష్‌, నానిల పాత్రల మీద అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read:  Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు

Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News