Trivikram Wife about Pawan Kalyan: త్రివిక్రమ్ ఇంట్లో పవన్ కళ్యాణ్‌ చేసే పనులివే.. అసలు విషయాలు చెప్పిన సౌజన్య శ్రీనివాస్

Trivikram Srinivas Wife About Pawan Kalyan: త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఓ నాట్యకళాకారిణి అన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రత్యేకంగా ఇచ్చే ప్రదర్శనలకు పవన్ కళ్యాణ్‌ సైతం ముఖ్య అతిథగా వెళ్తుంటాడు. ఇప్పుడు త్రివిక్రమ్ భార్య సైతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2023, 03:12 PM IST
  • నిర్మాతగా మారిన త్రివిక్రమ్ భార్య
  • పవన్ కళ్యాణ్‌పై సౌజన్య శ్రీనివాస్
  • వాటిని ఎవ్వరికీ ఇవ్వని త్రివిక్రమ్
Trivikram Wife about Pawan Kalyan: త్రివిక్రమ్ ఇంట్లో పవన్ కళ్యాణ్‌ చేసే పనులివే.. అసలు విషయాలు చెప్పిన సౌజన్య శ్రీనివాస్

Trivikram Srinivas Wife Sowjanya about Pawan Kalyan: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకుడిగా స్టార్డం అనుభవిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ తన భార్య సౌజన్యను నిర్మాతగా చేశాడు. సితార బ్యానర్‌తో కలిసి త్రివిక్రమ్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వాటికి త్రివిక్రమ్ భార్య పేరు నిర్మాతగా కనిపిస్తుంటుంది. ఇక త్రివిక్రమ్ భార్య నృత్య కళాకారిణి అన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ సాధించింది. సార్ సినిమా మొదటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

త్రివిక్రమ్ తన పెదనాన్న (సిరివెన్నెల సీతారామశాస్త్రి) దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినప్పటి నుంచి తెలుసని, త్రివిక్రమ్ చాలా మంచివాడని, తనకు ఇచ్చి పెళ్లి చేశారని, చిన్నతనంలోనే తమ పెళ్లి జరిగిందని సౌజన్య చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్‌ తనను ఎంతగానో ప్రోత్సహించేవాడని, ఆయన వల్లే పుస్తక పఠనం అలవాటైందని చెప్పుకొచ్చింది. పుస్తక పఠనం వల్ల ఎంతో మార్పు వచ్చిందని కూడా తెలిపింది.

త్రివిక్రమ్ తనకు చదువుల్లో హెల్ప్ చేసేవాడని, మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడని, ఆ ట్యూషన్ చెప్పే టైంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడట. ఒక వేళ త్రివిక్రమ్ టీచర్ అయితే మాత్రం స్టూడెంట్స్ అంతా కూడా పాస్ అయ్యేవారని చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్‌ తమ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి సిగ్గు లేకుండా.. కలిసిపోతాడని, మొహమాట పడకుండా అడిగి మరీ ప్రత్యేక వంటకాలు చేయించుకుంటారని తెలిపింది.

ఉప్మా, రవ్వలడ్డూలు, ఆవకాయ అన్నం ఇలా తనకు ఇష్టమైన వన్నీ అడుగుతారని తెలిపింది. తమ ఇంటి వంట అంటే ఆయనకు మహా ఇష్టమని పేర్కొంది. ఇక త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌ కలిస్తే లోకాన్ని మరిచిపోతారని, పురాణాల గురించి ఎక్కువగా చర్చించుకుంటారని చెప్పుకొచ్చింది. ఎవ్వరికీ తన పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్‌ అడిగితే మాత్రం వెంటనే ఇస్తాడని సౌజన్య తెలిపింది.

Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News