Pan India Directors:ఒకప్పుడు తెలుగు సినిమా టాలీవుడ్ కే పరిమితం కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ ని దాటుకొని పాన్ వరల్డ్ లో తన సత్తా ని చాటుతోంది.. ఈ నేపథ్యంలో పాత చింతకాయ పచ్చళ్ళు జనాలకి రుచించడం లేదు. కొత్త తరం అడుగుపెట్టిన తర్వాత సినిమాలు తీసే విధానంలోనే కాదు.. సినిమా కథల్లో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 కోట్లకు పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళుతున్నారు కొందరు డైరెక్టర్లు.
రాజమౌళి ,సుకుమార్ ,సందీప్ రెడ్డి వంగ,చందు మొండేటి, ప్రశాంత్ నీల్.. ఇలా కొందరు డైరెక్టర్లు.ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ను పాన్ మార్కెట్ నుంచి పెంచి ఓ బ్రాండ్ గా మారుస్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు ఫలానా హీరో ఉంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేది. అయితే ఇప్పుడు హీరోతో పాటు ఆ మూవీకి డైరెక్టర్ గా దర్శకత్వ బాధ్యతలు వ్యవహరించే వ్యక్తి ఎవరు అనేదానిపై ఆ మూవీకి వచ్చే హైప్ ఆధారపడి ఉంది.
బాహుబలి ,పుష్ప ,కార్తికేయ 2, అర్జున్ రెడ్డి, యానిమల్.. లాంటి చిత్రాలు డైరెక్టర్ తలుచుకుంటే బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులు సృష్టించచ్చు అన్న విషయాన్ని నిరూపించారు. కంటెంట్ సాలిడ్ గా ఉంటే సినిమా శబ్దం లేకుండా విడుదలైన బాక్స్ ఆఫీస్ బద్దలై పోతుంది అని రికార్డులు సృష్టించారు. ఇకపై సినిమాల్లో నటించే హీరోల కంటే కూడా డైరెక్ట్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ల ప్లానింగ్ స్పాన్ ఆ రేంజ్ లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇండియా టార్గెట్ ను దాటి వీళ్ళ దృష్టి వరల్డ్ టార్గెట్ వైపు వెళ్తోంది.
దీంతో సీనియర్లు అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు. కేవలం టాలీవుడ్ కి సెట్ అయ్యే సినిమాలు చేస్తాం.. హీరోకి సెట్ అయ్యే డైలాగ్ పెడతాం.. ఇలా ఆలోచిస్తే ఇకపై కుదిరే ప్రసక్తి కనిపించడం లేదు. క్రియేటివ్ పరంగా ప్రస్తుతం సినిమాలు ఇప్పటివరకు ఉన్న అన్ని పరిధులు దాటేసాయి. ఇప్పటివరకు తెలుగు ఆడియోస్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తున్న సీనియర్ డైరెక్టర్లు ఇకనైనా తమ ఫోకస్ స్ మిగిలిన మార్కెట్లపై కూడా పెట్టాలి.. లేకపోతే కష్టమే.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి