Icon Movie: ఐకాన్ సినిమా ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు

Icon Movie: తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ నిర్మాత అంటే దిల్‌రాజు పేరు ఠక్కున చెప్పేయవచ్చు. సినిమా కోసం నూటికి నూరుశాతం ఎఫర్ట్ పెట్టే వ్యక్తి కాబట్టే పరిశ్రమలో మంచి పేరుంది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు దిల్‌రాజు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2021, 04:12 PM IST
Icon Movie: ఐకాన్ సినిమా ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు

Icon Movie: తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ నిర్మాత అంటే దిల్‌రాజు పేరు ఠక్కున చెప్పేయవచ్చు. సినిమా కోసం నూటికి నూరుశాతం ఎఫర్ట్ పెట్టే వ్యక్తి కాబట్టే పరిశ్రమలో మంచి పేరుంది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు దిల్‌రాజు.

బడ్జెట్ చిన్నదైనా లేదా పెద్దదైనా సరే కమిట్ మెంట్ ఇచ్చాడంటే చాలు. పూర్తవుతుందనే నమ్మకం ఉంటుంది దర్శకుడికి. అందుకే టాలీవుడ్‌(Tollywood)లో నిర్మాత దిల్‌రాజుకు ప్రత్యేక స్థానముంది. సినిమా కోసం పూర్తిగా ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు దిల్‌రాజు(DilRaju). తాజాగా వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వకీల్ సాబ్ ఘన విజయంతో రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు దిల్‌రాజు.

వాస్తవానికి వకీల్ సాబ్ సినిమా(Vakeel saab movie) కంటే ముందే వేణు శ్రీరామ్, దిల్‌రాజు కాంబినేషన్‌లో రావల్సిన సినిమా ఐకాన్. బన్నీ హీరోగా ప్రకటించిన సినిమా ఇది. ఈ సినిమాపై ప్రకటన విడుదలై రెండేళ్లు అవుతున్నా సరే పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరామ్ ఫామ్‌లో ఉండటం, వకీల్ సాబ్ హిట్ కొట్టడంతో దిల్‌రాజు ఐకాన్ సినిమా (Icon Movie) గురించి మాట్లాడాడు. తన తదుపరి ప్రాజెక్టు ఐకాన్ సినిమానేనని..త్వరలో సెట్స్‌పై వెళ్తుందని స్ప,ష్టం చేశాడు దిల్‌రాజు. వకీల్ సాబ్ కంటే ముందే ఐకాన్ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందని..స్క్రిప్ట్ బాగుందని..అందరికీ నచ్చుతుందని దిల్‌రాజు చెప్పాడు. అయితే ప్రస్తుతం బన్నీ..సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా( Pushpa movie) తో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. సో పుష్ప సినిమా పూర్తయితేనే గానీ ఐకాన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. అందుకే ఐకాన్ సినిమాపై అధికారిక ప్రకటనకు మరి కాస్త సమయం పట్టవచ్చు.

Also read: Vakeel saab: వకీల్ సాబ్ కలెక్షన్లకు కరోనా దెబ్బ కొట్టిందా, ఆ మార్కెట్‌లో ఘోర పరాజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News