Dil Rajus Daughter: సినిమాల్లోకి దిల్ రాజు కూతురు.. విజయ్ ప్రాజెక్ట్​తోనే ఎంట్రీ!

Dil Rajus Daughter: ప్రముఖ సినీ నిర్మాత దిల్​ రాజు.. తమ సంస్థ ప్రొడక్షన్​ బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన కూతురుకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 12:49 PM IST
  • సినిమాల్లోకి నిర్మాత దిల్​ రాజు కూతురు
  • శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​లో కీలక బాధ్యతలు
  • విజయ్​ తెలుగు సినిమాతోనే ఎంట్రీ?
Dil Rajus Daughter: సినిమాల్లోకి దిల్ రాజు కూతురు.. విజయ్ ప్రాజెక్ట్​తోనే ఎంట్రీ!

Dil Rajus Daughter: తెలుగు చిత్ర సీమలో విజయవంతమైన నిర్మాతల్లో దిల్​ రాజు కూడా ఒకరు. తొలి సినిమా దిల్​తోనే భారీ విజయాన్ని అందుకున్నందుకు ఆయన ఇంటిపేరే దిల్​ గా మారిపోయింది. ఇప్పుడు దిల్​ రాజు.. తమ సంస్థ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​) ప్రొడక్షన్​ బాధ్యతలను తరువాతి తరానికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన సొదరుడి కుమారుడు హర్షిత్​ రెడ్డి.. ప్రొడక్షన్​ పనులు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె హన్షితా రెడ్డి కూడా టీమ్​లో జాయిన్​ కానున్నట్లు తెలుస్తోంది.

ఆర్​ఆర్​ఆర్ మూవీ టీమ్​కు దిల్ రాజు ఇటీవల పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ పార్టీ ఆలోచన దిర్​ రాజు కూతురిదేనని టాలీవుడ్​ వర్గాల టాక్​. పరిశ్రమ పెద్దలతో పరిచయాలను పెంచుకోవడం కోసమే ఆ పార్టీ ఇచ్చినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తమిళ స్టార్​ హీరో విజయ్.. స్ట్రెయిట్ తెలుగు సినిమా (తమిళంలో కూడా ఏకకాలంలో షూట్​ జరుపుకోనుంది)కు సంబంధించిన ఈవెంట్స్​లో తరచూ కనిపించడం కూడా.. ఈ అంచనాలకు మరింత ఊతమందించినట్లయింది.

ఇకపై దిల్​ రాజు ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చే అన్ని సినిమాల్లోనూ హన్షితా రెడ్డి కీలకకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇటీవలే దిల్​ రాజు ఓటీటీల కోసం డిజిటల్ విభాగాన్ని కూడా ఆవిష్కరించారు. దీనితో ఈ కొత్త విభాగం బాధ్యతలను కూడా కుమార్తెకే అప్పగించే అవకాశాలున్నాయని టాక్.

Also read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్.. పవర్ ఫుల్ పాత్రలో..

Also read: Pushpa Movie: అత్యంత సన్నిహితులకు విదేశాల్లో పుష్ప సక్సెస్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News