Ram Pothineni Marriage: అయ్యో దేవుడా.. ఇక ఆపండి! పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్‌

Ram Pothineni gives clarity about his marriage. తాజాగా రామ్‌ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 29, 2022, 08:21 PM IST
  • అయ్యో దేవుడా.. ఇక ఆపండి
  • పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్‌
  • జూలై 14న వారియర్‌ రిలీజ్‌
Ram Pothineni Marriage: అయ్యో దేవుడా.. ఇక ఆపండి! పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్‌

Ram Pothineni gives clarity about his marriage rumours: టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అందులో ఎనర్జిటిక్ హీరో 'రామ్‌ పోతినేని' ఒకరు. అయితే రామ్‌ త్వరలోనే బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తన చిన్ననాటి స్నేహితురాలు, హై స్కూల్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని రామ్ వివాహమాడుతున్నట్లు నెట్టింట జోరుగా వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ వార్తలపై రామ్‌ స్పందించారు. 

తాజాగా రామ్‌ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. 'ఓరి దేవుడా.. ఇక చాలు ఆపండి. హైస్కూల్‌ ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తలు మా కుటుంబ సభ్యుల వరకు వచ్చాయి. అలాంటిది ఏమీ లేదని నా ఫ్యామిలీ, స్నేహితుల‌ను ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే నేను స్కూలుకు కూడా సరిగా వెళ్లేవాడినే కాదు' అంటూ రామ్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పుకార్ల‌కు పుల్ స్టాప్ ప‌డింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన రామ్‌ పోతినేని వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన 'వారియర్‌' సినిమాలో నటించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా రామ్ ఓ సినిమా చేస్తున్నారు. 

Also Read: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజ‌మ్.. టీ20ల్లో అరుదైన ఘనత!

Also Read: Benefits Of Cucumber For Hair: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News