Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో తనీష్‌, కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా

Tanish spotted at ED office : తనీష్‌కు డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈడీ అధికారులు. ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు తనీష్ హాజరయ్యారా లేదా ఎఫ్‌క్లబ్‌లో డ్రగ్స్ సరాఫరా చేస్తారా అనే కోణాల్లో విచారణ సాగుతోందని సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2021, 03:55 PM IST
  • ఈడీ విచారణకు హాజరైన హీరో తనీష్‌
  • మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్‌ ఉల్లంఘనపై విచారణ
  • ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలపై ఆరా
Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో తనీష్‌,  కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా

Tollywood Drugs Case Actor Tanish spotted at ED office: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ కొనసాగిస్తోంది. హీరో తనీష్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు.  మనీలాండరింగ్‌, (money laundering) ఫెమా యాక్ట్‌ (FEMA Act) ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎఫ్‌ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు.

మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. తనీష్‌కు (Tanish) డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈడీ అధికారులు. ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు తనీష్ హాజరయ్యారా లేదా ఎఫ్‌క్లబ్‌లో డ్రగ్స్ సరాఫరా చేస్తారా అనే కోణాల్లో విచారణ సాగుతోందని సమాచారం. అలాగే డ్రగ్స్‌ వినియోగించే సెలబ్రిటీలు మీకు ఎవరైనా తెలుసా తనీష్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Also Read : Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన, వైసీపీ‌‌, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం

ఇక తనీష్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకి కెల్విన్‌ (Kelvin)తో ఎలాంటి పరిచయాలు లేవని, ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయితే కెల్విన్‌ సమక్షంలో తనీష్‌ను టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై (Tollywood Drugs Case) సుదీర్ఘంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లోనూ తనీష్‌ ఎక్సైజ్‌ విచారణకు హాజరయ్యారు.

Also Read : Ola scooters: దుమ్మురేపుతున్న 'ఓలా'..రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు విక్రయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News