RGV New Movie: సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు మరోసారి ట్వీట్‌తో అందర్నీ ఆలోచింపజేస్తున్నాడు. త్వరలో భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు. సినిమా పేరు కూడా వెల్లడించాడు. ఆ వివరాలు మీ కోసం..
గత కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న నాసిరకం సినిమాలకే పరిమితమైన రామ్ గోపాల్ వర్మ తన స్థాయి సినిమాలకు దూరమయ్యాడు. ఒకప్పుడు శివ, సత్య, రంగీలా, సర్కార్ వంటి చిత్రాల్ని తీసిన ఆయన చాలా కాలంగా వాటికి దూరమై సైడ్ ట్రాక్ అయ్యాడు. వర్మ నుంచి ఇటీవలి కాలంలో ఒక్క కల్ట్ లేదా క్లాసిక్ సినిమా రాలేదు. దాదాపు 27 ఏళ్ల తరువాత తాను తీసిన సత్య సినిమాను చూసిన తనలో మార్పు వచ్చిందని ఆర్జీవీ స్వయంగా ప్రకటించాడు. అలాంటి సినిమాను బెంచ్ మార్క్ గా ఎందుకు పెట్టుకోలేకపోయానంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దాంతో తాజాగా సరికొత్త ట్వీట్ చేసి అందర్నీ ఆలోచింపజేస్తున్నాడు. త్వరలో తాను పాన్ ఇండియా సినిమా తీయనున్నానని పేరు కూడా ప్రకటించాడు.
ఇకపై మంచి సినిమాలే తీస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. కొందరు ఆర్జీవీ ట్వీట్ నమ్మితే..మరికొందరు కొట్టిపారేస్తున్నారు. వర్మ మాత్రం తాను ఈసారి భారీ కాస్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయి సినిమా తీస్తానని స్పష్టం చేశాడు. తన కొత్త సినిమా పేరు సిండికేట్ అని చెప్పాడు.
“ONLY MAN CAN BE THE MOST TERRIFYING ANIMAL “
In CONTINUATION to my CONFESSION note on SATYA film , I DECIDED to make the BIGGEST film ever
The film is called SYNDICATE
It’s about a terrifying organisation which threatens the very EXISTENCE of INDIA
The CONCEPT
STREET…
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2025
వర్మ కొత్త సినిమా నేపధ్యం ఇదే
కొత్త సినిమా పేరు వెల్లడించడమే కాకుండా సినిమా నేపధ్యాన్ని కూడా వివరించాడు.1970వ దశకంలో భారత దేశం స్ట్రీట్ గ్యాంగ్స్ నుంచి ఐసిస్ వరకూ ఎన్నోరకాల సంఘ వ్యతిరేక శక్తుల్ని చూసిందని గత 15 ఏళ్లుగా ఎలాంటి గ్రూప్స్ లేవవి భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటాయో సిండికేట్ సినిమాలో చూపిస్తానని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా..సిండికేట్ సినిమకు ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఈ ఒక్క సినిమాతో తాను గత పదేళ్లుగా చేసిన సినిమా పాపాల్ని కడిగేసే ప్రయత్నం చేస్తానన్నాడు. కొత్త సినిమా సిండికేట్‌లో పనిచేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో షేర్ చేస్తానన్నాడు.
Also read: Los Angeles Wild Fire: ఆగని లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు, 2 గంటల్లో 8 వేల ఎకరాలు ఆహుతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి