Tollywood: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు

Tollywood: సంచలన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో త్వరలో సినిమా రాబోతోంది. ఎప్పుడనేది తెలియదు కానీ ఇప్పటికే ఆ సినిమాకు ఇద్దరూ ఓకే చెప్పేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2021, 09:30 PM IST
 Tollywood: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు

Tollywood: సంచలన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో త్వరలో సినిమా రాబోతోంది. ఎప్పుడనేది తెలియదు కానీ ఇప్పటికే ఆ సినిమాకు ఇద్దరూ ఓకే చెప్పేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్‌లో (Tollywood) ఇప్పుడు అందరి ఆసక్తి రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్ మూవీ కోసమే.ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయాలనేది నిర్మాత కేఎల్ నారాయణకు ఎప్పట్నించో ఉన్న కోరిక. ఇందుకు తగ్గట్టుగానే రాజమౌళి, మహేశ్‌బాబులు బిజీగా లేని సమయంలో మాట తీసుకున్నారు. అంటే కేఎల్ నారాయణ నిర్మాతగా ఆ ఇద్దరు సినిమాకు ఒప్పుకున్నారు కానీ..ఇద్దరి బిజీ షెడ్యూల్ కారణంగా కార్యాచరణలో రావడం లేదు. ఆఫ్రికన్ అడవుల్లో తీసే యాక్షన్ సినిమాగా ఇది ఉండబోతోందని సమాచారం. రాజమౌళి (Rajamouli)సినిమా అంటే డేట్స్ ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అదే ఇప్పుడు సమస్యగా మారింది.

అయితే ఈ విషయంలో ఆ ఇద్దరూ ఇప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని నిర్మాత కేఎల్ నారాయణ చెబుతున్నారు. కథాంశం ఎలా ఉంటుందనేది ఇంకా ఖరారు కాలేదు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే కధకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ ముగ్గురి సంగతి ఎలా ఉన్నా..అభిమానుల్లో మాత్రం పెద్దఎత్తున అంచనాలున్నాయి. మహేశ్‌బాబు ( Mahesh babu) ప్రస్తుతం సర్కారు వాటి పాటతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉంటే..రాజమౌళి ఆర్ఆర్ఆర్‌లో బిజిగా ఉన్నాడు. 

Also read: Ajay Devgn purchases new bungalow: రూ. 60 కోట్లతో బంగ్లా కొన్న అజయ్ దేవ్‌గన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News