Mahesh Babu Controversy: సూపర్‌స్టార్ మహేశ్ బాబు వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగలేదు. బాలీవుడ్‌పై మహేశ్ చేసిన వ్యాఖ్యలకు మొన్న నిర్మాత ముకేష్ భట్ స్పందిస్తే..ఇప్పుడు బోనీ కపూర్, ఆర్జీవీలు మాట్లాడారు.
బాలీవుడ్ నన్ను తట్టుకోలేదు. ఇది సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు. ఎప్పుడూ వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే మహేశ్ బాబు తొలిసారిగా అందులో ఇరుక్కున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తట్టుకోలేదని..అక్కడికి వెళ్లి తన సమయం వృధా చేయదల్చుకోలేదనేది మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై నిన్న బాలీవుడ్ నిర్మాత ముకేష్ భట్ స్పందించారు. మహేశ్ బాబు వ్యాఖ్యల్లో తప్పేమీలేదని..అతడొక సక్సెస్‌ఫుల్ నటుడని ప్రశంసించాడు కూడా.
మహేశ్ వ్యాఖ్యలపై బోనీ కపూర్ స్పందనేంటి
ఇప్పుడు తాజాగా మహేశ్ వ్యాఖ్యలపై స్పదించేందుకు మరో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తిరస్కరించారు. ఏదో ఒక ఇండస్ట్రీ గురించి తాను మాట్లాడనని..ఎందుకంటే తనవరకూ తాను రెండు ఇండస్ట్రీలకు చెందినవాడినని చెప్పుకొచ్చారు. తాను తమిళం, తెలుగు రెండింటిలో సినిమాలు చేసినందున కామెంట్ చేయలేనన్నారు. తాను అనుకున్నది చెప్పే హక్కు మహేశ్ బాబుకు ఉందని..బాలీవుడ్ తనను భరించజాలదనేది అతని అభిప్రాయం కావచ్చని బోనీ కపూర్ చెప్పారు. మహేశ్ బాబు ఆ అభిప్రాయానికి రావడంతో అతనికేమైనా ప్రత్యేక కారణాలుండవచ్చని చెప్పారు.
మహేశ్ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్
సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన రామ్‌గోపాల్ వర్మ మహేశ్ వ్యాఖ్యలపై స్పందించాడు. బాలీవుడ్ అనేది ఓ కంపెనీ కాదని..మీడియా అలా క్రియేట్ చేసిందన్నాడు.ఇండివిడ్యువల్ సినిమా సంస్థ లేదా ఏదైనా ప్రొడక్షన్ హోస్ మాత్రం సినిమా ఆఫర్ ఇస్తుందని..అలాంటిది మొత్తం బాలీవుడ్‌కు ఎలా ఆపాదిస్తారని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ అనేది ఓ కంపెనీ కానప్పుడు అతనెలా ఆ మాటలు చెబుతాడని..తనకైతే ఈ విషయం అర్దం కాలేదని చెప్పాడు. బాలీవుడ్ తనను భరించలేదని మహేశ్ చేసిన వ్యాఖ్యలు తనకు అర్ధం కాలేదన్నాడు.
Also read: Tamilnadu: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌పై ఛైల్డ్ లేబర్, గృహ హింస కేసు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook