Three Prabhas Movies to Release in 6 Months: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులు ఏ మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్న నేపద్యంలో సరైన హిట్ పడకపోతుందా అని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో హిందీలో ఒక మాదిరి హిట్ అయినా తెలుగులో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన రాధేశ్యామ్ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఒక సరైన హిట్టు కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో మూడు సినిమాలు 6 నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ముందుగా ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల అయ్యేందుకు అంతా సిద్ధమైంది.
ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా 16వ తేదీన కచ్చితంగా విడుదలై తీరుతుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అయ్యేందుకు అంతా సిద్ధమైంది. తాజాగా ఇదే విషయాన్ని సినిమా యూనిట్ మరోసారి ఖరారు చేసింది కూడా. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు.
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే జూన్ నుంచి జనవరి లోపు ఆరు నెలల వ్యవధిలో ప్రభాస్ హీరోగా నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడం ఇప్పుడు ఆయన అభిమానులకు పండుగల మారిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే ఈ మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో విడుదలవుతాయా లేక మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయో అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?
Also Read: Mahesh Babu Rajamouli Film: కామెరూన్ కామెంట్స్ తో మహేష్ -జక్కన్న మూవీపై ఇంటర్నేషనల్ లెవల్లో అంచనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook