Liger Movie Offer: సొంత ఊళ్లో పూరీకి షాక్.. లైగర్ మూవీ టికెట్లపై 3+1 ఆఫర్

Theatre owner at Narsipatnam Announces offer for Liger Movie: మూడు టికెట్లు కొంటె ఒక టికెట్ ఫ్రీ అంటూ లైగర్ మూవీకి ఆఫర్ ప్రకటించారు ఒక థియేటర్ యజమాని ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 12:29 PM IST
Liger Movie Offer: సొంత ఊళ్లో పూరీకి షాక్.. లైగర్ మూవీ టికెట్లపై 3+1 ఆఫర్

Theatre owner at Narsipatnam Announces offer for Liger Movie: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే, అలీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ దెబ్బకు సినిమా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నంలో ఒక థియేటర్ యజమాని పెట్టిన ఆఫర్ ఆసక్తికరంగా మారింది. నర్సీపట్నంలో పివిఆర్ సినీ మ్యాక్స్ లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదని భావించిన సినిమా థియేటర్ యజమాని ఒక ఆఫర్ ప్రకటించారు.

అదేమంటే మూడు టికెట్లు కనుక కొంటే ఒక టికెట్ ఉచితం అంటూ ఒక స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ టీమ్ ఏర్పాటు చేసి మరీ ఆదివారం నాడు ఇంటికి వెళ్లి పాంప్లెట్స్ అందజేసినట్లు తెలుస్తోంది. గతంలో సినిమాలకు ఈ విధంగా ఎప్పుడూ ప్రచారం చేయకపోవడంతో ప్రజలందరూ దీని మీద తీవ్రంగా చర్చ జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూరీ జగన్నాథ్ సొంత గ్రామం అంటే బాపిరాజు కొత్తపల్లి అనే గ్రామం ఈ నర్సీపట్నం మండలంలోనే ఉండడం గమనార్హం.

ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే మరెవరో కాదు పూరీ జగన్నాథ్ సొంత తమ్ముడు. ఇక పూరీ సినిమాకి డిజాస్టర్ ఫలితాలు రావడంతో ప్రేక్షకులు సినిమా చూసి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని స్థానికులు భావిస్తున్నారు. అయితే తమ ఊరి వాడి సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమా చూసి తీరుతామని వారు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: Janhvi Kapoor Hot Photos: నెవర్ బిఫోర్ అనేలా జన్వీ ఎద అందాల విందు..(ఫోటోలు)

Also Read: Krithi Shetty Saree Photos: చీరకట్టులో మెరిసిన బేబమ్మ.. ఫోటోలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News