Taraka Ratna Latest Health Update: కొన్నాళ్ల క్రితం కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ముందుగా కొన్ని రోజులపాటు హెల్త్ బులిటెన్స్ విడుదల చేస్తూ వచ్చిన వైద్యులు ఇప్పుడు హెల్త్ బులిటెన్ ని విడుదల చేయడం కూడా ఆపేశారు. అయితే నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒకరు కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున పాల్గొన్న తారకరత్న గుండిబాటుకు గురవడంతో ఆయనని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే కుప్పంలో తారకరత్న గుండెపోటుకు గురైన సమయం నుంచి నందమూరి బాలకృష్ణ వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అత్యవసరమైన చికిత్స అందేలా వైద్యులకు కుటుంబ సభ్యులకు మధ్య వారధిలా నిలుస్తూ ఎప్పటికప్పుడు ఆయన గురించి కేర్ తీసుకుంటున్నారు.
ఇప్పటికే గుండె సంబంధిత సమస్య నుంచి బయటపడిన తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స అయితే తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వైద్య పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? అనే విషయం మీద కొంత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఉందని కుప్పంలో గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన గుండె పనితీరు మీద ప్రభావం పడటంతో అది మెదడు మీద ప్రభావం పడింది అని చెబుతున్నారు.
ముందుగా మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలిస్తారని ముఖ్యంగా ఆస్ట్రేలియా తరలించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం బెంగళూరులోనే విదేశీ వైద్యులతో చికిత్స అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ వైద్యులను ఎంత ఖర్చు పెట్టైనా ఇక్కడికి రప్పించి చికిత్స అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులు చేరుకున్నారని మరి కొంతమందిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
Also Read: Balakrishna Fires: నిర్మాతలను కసురుకున్న బాలకృష్ణ.. అసలు ఏమైందంటే?
Also Read: Mahesh Fans in Tension:త్రివిక్రమ్ దెబ్బకు టెన్షన్లో మహేష్ ఫాన్స్.. రెండు పడవల ప్రయాణం అవసరమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook