Tammareddy Bharadwaj Liger: ప్రమోట్‌ చేసుకుంటే సరిపోతుంది.. చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది: తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj shocking Comments on Liger Movie. లైగర్‌ సినిమా ఫలితంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 11:32 AM IST
  • చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది
  • లైగర్‌పై తమ్మారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌
  • బాక్సాఫీస్ వ‌ద్ద లైగర్‌ బోల్తా
Tammareddy Bharadwaj Liger: ప్రమోట్‌ చేసుకుంటే సరిపోతుంది.. చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది: తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj Sensational Comments on Vijay Devarakonda Liger Movie: రౌడీ హీరో విజ‌య్‌ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్రలో న‌టించిన‌ సినిమా లైగ‌ర్. బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కించారు. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీ రోల్‌లో న‌టించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు. భారీ అంచనాల మధ్య ఆగష్టు 25న విడుదల అయిన లైగర్‌ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది. 

లైగర్‌ సినిమా ఫలితంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని, మన యాక్షన్‌ పైనే ప్రేక్షకుల రియాక్షన్‌ ఉంటుందన్నారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... 'సినిమా రంగం అనే కాదు.. ఏ పనిలో అయినా ఎగిరెగిరిపడొద్దు. ఎగిరిపడితే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. మేము ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించాం, మా చిత్రాన్ని చూడండి అంటూ సినిమాని ప్రమోట్‌ చేసుకుంటే చాలు. అంతేకానీ చిటికెలు వేస్తే కుదరదు. ఆలా చేస్తే ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే ఇస్తారు' అని అన్నారు. 

లైగర్‌ సినిమా పరాజయానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు అని అడగ్గా... 'లైగర్‌ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అయితే నేను పూరీ జగన్నాథ్‌ అభిమానిని. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఓ విషయం చెప్పాలి.. లైగర్‌ ట్రైలర్‌ చూసినప్పుడే సినిమా చూడాలనిపించలేదు. ఇప్పటికి ఈ చిత్రం చూడలేదు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తా' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. 

Also Read: LPG Cylinder Price: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధర...  

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. గడిచిన 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News