Suspicious Persons Following Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరుతో విశాఖపట్నంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న రోజే ఆయన జనవాణి పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవగా వైసీపీ జనసేన శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేశారంటూ కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
పవన్ కళ్యాణ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించాలని విశాఖ వెళ్లారో ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ పరిస్థితుల తరువాత కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారని పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విశాఖ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న కొంత మంది వ్యక్తులు కనిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని పరిశీలిస్తున్నారని అలా అనుసరిస్తున్న వారు అభిమానులు కాదని పవన్ వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారని వారి కదలికల అనుమానాస్పదంగా ఉన్నాయని వారు వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం నాడు కూడా ఒక కారులో అనుసరించారని మంగళవారం నాడు ద్విచక్ర వాహనాలపై అనుసరించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని కావాలని కారు ఇంటి ఎదురుగా ఆపి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారని అన్నారు కావాలని సెక్యూరిటీ సిబ్బందిని తిడుతూ పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ గొడవ చేయడానికి ప్రయత్నించారని సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
అయితే తమ సూచనలను మేరకు చాలా సమయం పాటించిన సిబ్బంది అక్కడ జరిగిన గొడవ అంతటినీ వీడియో తీసి తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ కి అందజేయగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఫిర్యాదు చేశారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెనుక అనుమానాస్పద వ్యక్తులు తెచ్చాడుతున్న వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
పవన్ వెంట అనుమానాస్పద వ్యక్తులు.. కారు, బైక్లపై ఫాలో అవుతూ అర్ధరాత్రి పంచాయితీ?