Rajinikanth: లవ్ టుడే హీరోకి రజనీ ప్రసంశలు.. గాల్లో తేలిపోతున్న ప్రదీప్!

Rajinikanth Fecilitates Pradeep Ranganathan: ఇటీవల లవ్ టుడే అనే తమిళ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాధన్ ను రజనీకాంత్ పిలిపించుకుని అభినందించారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 12, 2022, 05:21 PM IST
Rajinikanth: లవ్ టుడే హీరోకి రజనీ ప్రసంశలు.. గాల్లో తేలిపోతున్న ప్రదీప్!

Superstar Rajinikanth Fecilitates Love today Hero Pradeep Ranganathan: భాష ఏదైనా సరే వైవిధ్యంగా ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని భావిస్తూ సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కంటెంట్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు ఆడియన్స్. తాజాగా తమిళంలో ఒక కంటెంట్ ఉన్న సినిమాను అక్కడి ఆడియన్స్ ఆదరిస్తున్నారు. తమిళంలో కోమలి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు లవ్ టుడే అనే సినిమాతో మరోసారి ప్రేక్షక ముందుకు వచ్చాడు. అయితే ఈసారి ఏకంగా ఆయన హీరోగా కూడా మారాడు.

ఈజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కలపతి ఎస్ అఘోరం నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా ఇవానా, రవీనా రవి కీలక పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాకి దినేష్ పురుషోత్తమ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ చేశారు. ఇక ఈ సినిమాని యాప్ లాక్ అనే తన సొంత షార్ట్ ఫిలిం ను బేస్ చేసుకుని తీశాడు ప్రదీప్ రంగనాథన్. నవంబర్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమా కోట్ల రూపాయల దాకా కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

బడా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమా చూసిన రజనీకాంత్ సినిమా దర్శకుడు కం హీరోను తన ఇంటికి పిలిపించుకోవడమే గాక సన్మానించి ఊహించని షాక్ ఇచ్చారు.  ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఎక్కువగా ఇంటిపట్టునే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన సినిమాలు చూసి ఆయా దర్శక నిర్మాతలు ఇంటికి పిలిపించుకోవడమే గాక వారిని సత్కరిస్తున్నారు. అందులో భాగంగానే కాంతార సినిమా హీరోని కూడా రజినీకాంత్ ఇంటికి పిలిపించుకోగా ఇప్పుడు లవ్ టు డే సినిమా హీరోను కూడా ఇంటికి పిలిపించుకోవడం ఆసక్తికరంగా మారింది.

రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకోవడమే కాక తన భుజం మీద చేయి వేసి మాట్లాడడంతో ప్రదీప్ రంగనాథన్ గాల్లో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేసుకోవడమే గాక తన అద్భుతమైన క్షణాలను పంచుకుంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు నేను ఇంకా ఏమి అడగగలను? సూర్యుని దగ్గర ఉన్నట్టు అనిపించింది, కాబట్టి వెచ్చగా ఉంది, ఒక టైట్ హగ్, ఆ కళ్ళు , నవ్వు , ఆ శైలి, ఆ ప్రేమ, ఎంత వ్యక్తిత్వం. సూపర్ స్టార్ @రజినీకాంత్ #LoveToday చూసి   మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను సార్ అంటూ పేర్కొన్నారు. 

Also Read: Bipasha Basu Baby Girl: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు.. కానీ?

Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News