Krishna And SPB Controversy : సూపర్ స్టార్ కృష్ణకు ఎస్పీబీకి మధ్య దూరం.. లోలోపల ఇంత జరిగిందా? రెమ్యూనరేషన్‌పై గొడవ

Krishna And SPB Controversy సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీబీ మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా చివరకు మళ్లీ కలిశారు. కృష్ణకు  పాటలు పాడారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 08:49 AM IST
  • సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
  • కృష్ణ, ఎస్పీబీకి మధ్య పెరిగిన దూరం
  • కృష్ణ మంచి మనసు ఇదే
Krishna And SPB Controversy : సూపర్ స్టార్ కృష్ణకు ఎస్పీబీకి మధ్య దూరం.. లోలోపల ఇంత జరిగిందా? రెమ్యూనరేషన్‌పై గొడవ

Krishna And SPB Controversy : సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్దరాత్రి దాటక, సోమవారం తెల్లవారుఝామున కృష్ణకు గుండెపోటు రావడంతో కాంటినెంటెల్ హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. సోమవారం అంతా కూడా వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. కండీషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు ప్రకటించారు. మంగళవారం నాడు ఉదయం కృష్ణ కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. కృష్ణ మరణం పట్ల చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో కృష్ణ ఎస్పీబీ మధ్య జరిగిన గొడవ, నాటి కాంట్రవర్సీ ఓ సారి చూద్దాం.

ఎస్పీబీ ఆ సమయంలో ఇతర హీరోలు, కమెడియన్లకు కూడా పాటలు పాడుతుండేవారు. అదే సమయంలో కృష్ణకు కూడా కంటిన్యూగా పాడేవారు. అలా తనకు హీరోగా పాడుతున్నప్పుడు మిగతా వాళ్లు, అలా కమెడియన్లకు ఎందుకు పాడటం అని కృష్ణ అడిగారట. మరో సందర్భంలో రెమ్యూనరేషన్ విషయంలో ఓ సారి గొడవ జరిగింది. ఆ రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇవ్వండని అడిగారట. అలా రెమ్యూనరేషన్ విషయంలో జరిగిన గొడవతో రెండేళ్ల పాటు కృష్ణకు బాలు పాడకుండా దూరంగా ఉండిపోయారట.

అయితే ఎస్పీబీకి మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలోనే కృష్ణ ఆదుకున్నారు. ఏడాదిలో నావి ఆరేడు చిత్రాలు వస్తాయి.. అవన్నీ నువ్వే పాడు అని ఎస్పీబీకి కృష్ణ భరోసా ఇచ్చారట. అయితే కృష్ణతో జరిగిన గొడవ గురించి ఎస్పీబీ మాట్లాడిన మాటలు ఇవే. ఆయన మాటల్లోనే

'ఎప్పుడూ హార్ష్‌గా మాట్లాడని ఆయన, నేను ఓసారి ఫోన్‌లో అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది.. ఆ రోజు నుంచి నేను ఆయనకు పాటలు పాడలేదు.. కానీ మేం బయట ఎదురుపడినప్పుడు ఎంతో చక్కగా మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇండస్ట్రీ మాత్రం నలిగిపోయింది.. కానీ సమసిపోలేదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్‌కు సంబంధించింది. కృష్ణ సినిమాది.. రాజ్ కోటి చేస్తున్నారు. వాళ్లు కూడా బాగా ట్రై చేశారు. నేను చక్రవర్తి గారిది అయినా కూడా పాడను అని అన్నాను. వేటూరి సుందరరామ్మూర్తి వచ్చిన నన్ను కన్విన్స్ చేశారు. విశ్వం గారికి ఆయన పాట రాయను అని భీష్మించుకుని కూర్చున్నారు కదా? అని అడిగాను. మరి మీరు ఆయనకు రాస్తారా? అని అడిగాను.

మేం మళ్లీ కలవడానికి వేటూరి గారే కారణం. వేటూరి గారు ఫోన్ చేశారు. నేను కృష్ణ గారితో మాట్లాడాను. నీతో కూడా మాట్లాడుతున్నాను. నిన్ను ఆయన ఎప్పుడైనా కలుస్తారట అని వేటూరి గారు అన్నారు. వద్దు నేనే వచ్చి కలుస్తాను అని పద్మాలయ స్టూడియోకి వెళ్లాను. స్టాఫ్ అంతా కూడా సైలెంట్ అయింది. ఈయన మన ఆఫీస్‌కు వచ్చారేంటి అని అంతా అనుకున్నారు. కృష్ణ గారు ఎక్కడ అంటే మీదున్నారు అని అన్నారు. నేను మీదకు వెళ్లి కలిశాను. నేను జరిగిన వాటి గురించి చెబుతుంటే.. అవన్నీ వద్దండి.. మనం ఈ రోజు నుంచి కలిసి పని చేస్తున్నామని అన్నారు' అంటూ ఎస్పీబీ వివరించి చెప్పారు.

Also Read : Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?

Also Read : Mahesh Babu: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి సోదరుడు మృతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News