Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్

Sukumar Sudden Shock to Pushpa 'Keshava': తనను కలవడానికి వచ్చిన పుష్ప సినిమా ‘కేశవ’ పాత్రధారి జగదీష్ ప్రతాప్ భండారికి సుకుమార్ సడన్ షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 10:27 AM IST
Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్

Sukumar Sudden Shock to Pushpa 'Keshava': అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక తెలుగు సినిమా సత్తాని నార్త్ లో కూడా చాటి చెప్పినట్లు అయింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజు అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించాడు.

ఎర్రచందనం దుంగలు కొట్టే కూలీగా మొదలైన అతని ప్రస్థానం ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ గా ఎలా ఎదిగాడు అంటూ ఆసక్తికరమైన అంశాలను సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమా ద్వారా జగదీష్ ప్రతాప్ బండారి మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్పరాజు వెనకాలే ఉంటూ అతనికి నమ్మిన బంటులా ఉండే కేశవ అనే పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

గతంలో కొన్ని సినిమాల్లో కనిపించిన అయన పుష్ప 2 సినిమా కోసం ఇప్పటివరకు మరో సినిమా ఒప్పుకొని ఆయన తాజాగా సుకుమార్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా కాలం తర్వాత సుకుమార్ సార్ ని కలిశానని ఆయనను చూడడం ఆయనతో సమయం గడపడం చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తోందని జగదీష్ ప్రతాప్ చెప్పుకొచ్చారు. అంతేకాక రెండు ఫోటోలు షేర్ చేసిన జగదీష్ అందులో ఒక ఫోటోలో బాగానే ఉన్నా రెండో ఫోటోలో నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

దానికి కారణం ఈ ఫోటో దిగేటప్పుడు సుక్కు సర్ పొట్ట లోపలికి పెట్టురా అన్నారని దానికి తాను నవ్వు ఆపుకోలేకపోయాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇలా సుకుమార్ లాంటి డైరెక్టర్ తనకు పంచ్ వేస్తారని ఊహించని జగదీశ్ ఒక్కసారిగా షాకయ్యాడు.  సుకుమార్ కామెడీ టైమింగ్ భలే ఉంది కదా అని కొందరు కామెంట్ చేస్తుంటే మొత్తానికి పుష్ప సినిమాలో నటించిన నటీనటులను మళ్లీ వెనక్కి వినిపించి మాట్లాడుతున్నారు అంటే త్వరలో పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం మొదలు అయింది. నిజానికి జగదీష్ ప్రతాప్ తో పాటు ఈ సినిమాలో మంగళం శీను బావమరిది మొగిలేశు పాత్రలో నటించిన రాజ్ తిరందాసు కూడా సుకుమార్ తో భేటీ అవడంతో ఇక త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: Rajinikanth as Governor: గవర్నర్ గా రజనీకాంత్.. ఇక సినిమాలకు బైబై!

Also Read: Three Heros Missed Sita Ramam: సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ సినిమాను హిట్ చేసుకున్న హీరోలు వీరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News