Sudha Kongara Met Accident : లేడీ డైరెక్టర్‌కు ప్రమాదం.. గాయాలతో సుధా కొంగర పోస్ట్

Sudha Kongara Met Accident లేడీ డైరెక్టర్ సుధా కొంగర పేరు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. సూరారై పొట్రూ అనే సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది సుధా కొంగర.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 12:49 PM IST
  • లేడీ డైరెక్టర్‌కు ప్రమాదం
  • సుధా కొంగర చేతికి గాయం
  • అనుకోకుండా దొరికిన రెస్ట్ అంటోన్న డైరెక్టర్
Sudha Kongara Met Accident : లేడీ డైరెక్టర్‌కు ప్రమాదం.. గాయాలతో సుధా కొంగర పోస్ట్

Sudha Kongara Met Accident లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఆమె చేతికి గాయమైనట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సుధా కొంగర ట్వీట్ వేశారు. ఎంతో బాధగా ఉంది.. అయినా ఆ బాధ కూడా బాగుంది.. ఎంతో చిరాకు పెట్టేస్తోంది.. నెల రోజుల పాటుగా ఈ రెస్ట్ తప్పదు.. అనుకోకుండా ఈ బ్రేక్ దొరికింది.. అనుకోని ప్రమాదం అన్నట్టుగా చెప్పుకొచ్చారు.

 

సుధా కొంగర ప్రస్తుతం బాలీవుడ్‌లో సూరారై పొట్రూ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమాలో సూర్య నటనకు అంతా ఫిదా అయ్యారు. చివరకు ఇండియా నుంచి అధికారకంగా ఆస్కార్‌కు పంపించారు. కానీ ఆస్కార్ నామినేషన్లో మాత్రం ఈ సినిమాకు అవకాశం దక్కలేదు. కానీ హీరోగా సూర్యకు, దర్శకురాలిగా సుధా కొంగరకు ఫుల్ మార్కులు పడ్డాయి.

దీంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో తీయాలని సుధా కొంగర, సూర్య ప్లాన్ చేశారు. హిందీలో ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నాడు. మొత్తానికి సుధా కొంగర మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది. మరి ఈ రీమేక్ తరువాత ఎలాంటి సినిమా తీస్తుంది.. అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

ఇక ఓ నెల రోజుల పాటు మాత్రం సుధా కొంగర ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది?.. అసలు ఏమైంది? అనే విషయాలు మాత్రం సుధా కొంగర బయటకు చెప్పలేదు.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News