Vishwambhara Release Date: బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన అప్డేట్స్ కూడా ఇస్తున్నారు చిరు.
తాజాగా తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ సెట్స్ లో జరిగిన ఒక విషయాన్ని పంచుకున్నారు. విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్ కు దగ్గరలోనే స్టార్ సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా షూటింగ్ చేస్తున్నారట. చిరు సినిమా షూటింగ్ గురించి తెలుసుకున్న అజిత్ విశ్వంభర సినిమా సెట్స్ కి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారట. దీని గురించి చిరంజీవి సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.
"నిన్న సాయంత్రం విశ్వంభర సెట్స్ లో స్టార్ గెస్ట్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఎంతో అభిమానంగా ఉండే అజిత్ కుమార్ కూడా పక్కనే షూటింగ్ చేస్తూ ఉండడంతో మా సెట్స్ కి వచ్చారు. మేమిద్దరం కలిసి బోలెడు విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎప్పటివో మా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాం. తన మొదటి సినిమా ప్రేమ పుస్తకం మ్యూజిక్ నేనే లాంచ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాం" అని పోస్ట్ చేశారు చిరంజీవి.
"ఇంకా తన భార్య శాలిని నేను చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిన్న పాప పాత్ర పోషించారు. ఇలా మా మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్ని ఏళ్లలో అజిత్ అందుకున్న విజయాలను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎంత స్టార్ అయినప్పటికీ ఆయన మనసు ఇంకా అంతే అందంగా ఉంది" అంటూ అని వాళ్ళు దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు చిరంజీవి.
ఇక విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, ఆశికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్ ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్ చేయడమే మార్పా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Also Read: KT Rama Rao: రేవంత్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter