Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!

Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 30, 2023, 05:10 PM IST
Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!

Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాని ఒక రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించడమే కాకుండా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతూ ఉండడంతో సినిమా మీద అందరి అంచనాలు ఏర్పడ్డాయి.

దానికి తోడు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించడంతో సినిమాల మీద ఉన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్ ఆద్యంతం ఒళ్ళు గగ్గురుపొడిచేలా సాగింది. సినిమాలో నాని గోదావరిఖని సింగరేణి గనుల్లో పనిచేసే ఒక కార్మికుడిగా కనిపిస్తుండగా ఆ గనుల నేపథ్యంలోనే సినిమా మొత్తం సాగినట్లుగా టీజర్ ద్వారా అర్థమవుతుంది. సుకుమార్ శిష్యుడే కావడంతో ఈ సినిమా దర్శకుడి మేకింగ్ మీద కూడా అందరూ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 

మందంటే ఒక వ్యసనం కాదు ఇది మా ఆచారం అని అర్థం వచ్చేలా నాని చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో వంటి ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు. అలాగే అలనాటి నటి జరినా వాహబ్, సాయి కుమార్ వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

నిమిషం 15 సెకండ్ల పాటు సాగిన దసరా టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పక తప్పదు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేయగా తమిళ టీజర్‌ను విలక్షణ నటుడు ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్, హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్లు రిలీజ్ చేశారు.  తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News