SP Balu: బాలు భార్యకు కూడా కరోనా పాజిటివ్ ?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి ( SP Balasubrahmanyam's wife Savitri ) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

Last Updated : Aug 16, 2020, 12:30 AM IST
SP Balu: బాలు భార్యకు కూడా కరోనా పాజిటివ్ ?

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) కరోనావైరస్ సోకిన అనంతరం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఐసీయులో లైఫ్ సపోర్టుపై చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐతే నాన్నకు ఏమీ కాదని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నందున అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఎస్బీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. Also read : Bithiri Sathi: బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్

ఇదిలావుండగానే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి ( SP Balasubrahmanyam's wife Savitri ) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Also read : Sourav Ganguly: ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా ఏమన్నాడంటే..

Trending News