Sonu Sood First Look: ఆచార్యలో సోనూ సూద్ లుక్ ఇదే.. గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్!

Sonu Sood New look from Acharya Movie. ఆచార్య సినిమాలో 'రియల్ హీరో' సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన విలన్ పాత్ర చేశారు. అయితే సోనూ సూద్ లుక్ ఇప్పటివరకు బయటికి రాలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 04:09 PM IST
  • మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఆచార్య
  • ఆచార్యలో సోనూ సూద్ లుక్ ఇదే
  • గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్
Sonu Sood First Look: ఆచార్యలో సోనూ సూద్ లుక్ ఇదే.. గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్!

Sonu Sood first look poster from Chiranjeevi starrer Acharya Movie: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 29న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి కలిసి ఆచార్య సినిమాను నిర్మించారు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చిరు, చరణ్ అతిథి పాత్రల్లో చేయగా.. ఫుల్ లెన్త్ చేయడం ఇప్పుడే మొదటిసారి. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 

ఆచార్య సినిమాలో 'రియల్ హీరో' సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన విలన్ పాత్ర చేశారు. అయితే సోనూ సూద్ లుక్ ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇటీవల విడుదల అయిన ఆచార్య ట్రైలర్‌లో కూడా సోనూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తాజాగా ఆయన పాత్రకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోటోలను బట్టిచూస్తే భిన్న గెటప్‌లలో సోనూ నటించారని అర్ధమవుతోంది. గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్ ఈ సినిమాలో చేశాడని సమాచారం. 

ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గత శనివారం (ఏప్రిల్ 23) గ్రాండ్‌గా జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సోనూ సూద్ రాలేదు. అంతేకాదు ఈవెంట్‌ మొత్తంలో ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా రియల్ హీరో పేరు ఎత్తలేదు. ఏ సినిమాకు అయినా విలన్ చాలా ముఖ్యం. ప్రతి నాయకుడు ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. అలాంటి విలన్ పాత్రలో నటించిన సోనూ పేరు మాత్రం ఈవెంట్‌లో మరిచిపోవడం ఏంటో ఎవరికీ ఆర్షం కాలేదు. 

ఆచార్య సినిమా షూటింగ్ లొకేషన్‌కు సోనూ సూద్ సైకిల్ మీద వెళ్లిన విషయం తెలిసిందే. సోనూకి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం.. పైగా ఉదయం కావడంతో సెట్‌కి సైకిల్ మీద వెళ్లారు. మరోవైపు రియల్ హీరోగా సోనూ పేరుతెచ్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కాటేసిన సమయంలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్నారు. అవసరమైన వారికి ఆక్సిజెన్ సిలిండర్లు, మందులు కూడా అందించారు. దాంతో కోట్లాది మంది ప్రజల మనసుల్లో దేవుడిగా ముద్రపడిపోయారు. 

Also Read: 'ఆ పరుగులను కూడా ఛేదించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.. బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ కష్టమే'

Also Read: Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News