Sonakshi Sinha says her first serious relationship was in her 20s, lasted over 5 years: 'It was a long one': బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. స్కూల్ టైమ్‌లోనే ఈ భామ ప్రేమలోపడిందట. ఆ వ్యక్తితో కొన్ని రోజులే రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది సోనాక్షి (Sonakshi). బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌లోకి (bollywood) ఎంట్రీ ఇచ్చింది. నటిగా తనకంటూ ఒక మార్క్ ఉంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ మేటర్స్‌ని బయటపెట్టింది ఈ అమ్మడు. తన రిలేషన్ షిప్ (relationship) గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
Also Read : అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..
తాను స్కూల్లో ఉన్నప్పుడే ఒక అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పింది సోనాక్షి. అయితే ఆ బంధానికి కొద్ది రోజులకే శుభంకార్డ్ పడిందని తెలిపింది. ఇక తర్వాత తాను ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్‌షిప్‌లో (relationship) ఉన్నానని చెప్పింది సోనాక్షి. అతనితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. అయితే ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయని.. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలి అని తన మనస్సులోని భావాలని చెప్పింది సోనాక్షి (Sonakshi). ఇక దబాంగ్ (Dabangg) సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి రీసెంట్‌గా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో అజయ్ దేవగన్‌తో (ajay devgan) కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉంది.
Also Read : చై-సామ్ విడాకులకు కారణం ఆ స్టార్ హీరోనే: కంగనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sonakshi Sinha relationship : స్కూల్ టైమ్‌లోనే ప్రేమాయాణం నడిపిన సోనాక్షి
ఇంట్రెస్టింగ్‌గా సోనాక్షి సిన్హా లవ్ స్టోరీస్
స్కూల్ టైమ్‌లోనే ప్రేమలోపడిన భామ
అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్నానన్న సోనాక్షి