Shobhita Dhulipala: షారుక్‎ను పక్కకు నెట్టిన శోభితా..ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో శోభితా ధూళిపాళ్ల ..!!

Sobhita Dhulipala : కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో శోభితా ధూళిపాళ్ల పేరు మారుమ్రోగుతోంది. యువ హీరో నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి..ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈవారం IMBD పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను పక్కకు నెట్టి దూసుకువచ్చారు శోభితా. రెండో స్థానంలో నిలిచారు.   

Written by - Bhoomi | Last Updated : Aug 13, 2024, 04:57 PM IST
Shobhita Dhulipala: షారుక్‎ను పక్కకు నెట్టిన శోభితా..ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో శోభితా ధూళిపాళ్ల ..!!

Sobhita Dhulipala Sharukh Khan : ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీబీ..విడుదల చేసిన ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో శోభితా ధూళిపాళ టాప్ 2 స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టాప్ 1లో నటి శార్వరీ ఉన్నారు. ఇండియన్ మూవీ డేటాబేస్ తాజాగా ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేసింది. అందులో శోభిత పలువురు స్టార్స్ ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. నాగచైతన్యతో ఆగస్టు 8వ తేదీన శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థం తర్వాతే శోభితా బజ్ ఒక్కసారిగా పెరిగింది. శోభితా కోసం నెటిజన్లు సెర్చ్ చేయడం షురూ చేశారు. దీంతో ఆమె పాపులారిటీ భారీగా పెరిగింది. దీంతో ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల్లో శోభితా ట్రెండింగ్ లో నిలిచారు. 

షారుఖ్ ఖాన్ ను నెట్టేసి:

ఐఎండీబీ లిసుట్లో శోభితా ధూళిపాళ్లకు రెండవ స్థానం దక్కింది. బాలీవుడ్ హీరోయిన్ శార్వరీ వాఘ్ మొదటిస్థానంలో నిలిచారు. ముంజ్యా మూవీ విజయవంతం తర్వాతర శార్వరవీ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. ఒక చైతూతో నిశ్చితార్థం తర్వాత శోభితా ట్రెండింగ్ లో నిలిచారు. నేషనల్ వైడ్ గా శోభితా గురించి ఎంతో మంది నెట్టింట సెర్చింగ్ చేశారు. దీంతో ఈ వారం షారుఖ్ మూడో స్థానానికి చేరారు. ఈ లిస్టులో షారుఖ్ ను పక్కకు నెట్టేసి రెండో స్థానంలో నిలిచారు శోభితా. 

టాప్ 10లో వీరు నిలిచారు: 

ఈ జాబితాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ 4,5 స్థానాల్లో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో రాణించిన యంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణే,తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ మ్రుణాల్ ఠాకూర్,ఐశ్వర్యరాయ్ ఈ వారం టాప్ పది జాబితాలో నిలిచారు. 

Also Read : Gold Price Today: పసిడి పరుగు..మళ్లీ పెరుగుతున్న బంగారం..తులం ఎంత ఉందంటే?

ఇక హీరో నాగ చైతన్య తో ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శోభితా. మనం పరిచయం ఎలా మొదలైనా..ప్రేమలో మన మనస్సులు కలిసిపోయాయంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టునే నాగచైతన్య రీపోస్టు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్,బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లోనూ శోభితా బిజీగా ఉన్నారు. మంకీ మ్యాన్ తో అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. దేవ్ పటేల్ డైరెక్షన్ లో తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ సొంతం చేసుకుంది. 

అటు నాగచైతన్య సైతం బిజీగా ఉన్నారు. చందూ మొండేటీ డైరెక్షన్ లో తండేల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది.నాగచైతన్య, సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకుని..2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శోభితాను వివాహం చేసుకోనున్నారు చైతన్య. 

Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News