Skanda: మైండ్ బ్లాంక్ చేస్తోన్న స్కంద మూవీ మూవీ ఫప్ట్ టీఆర్పీ.. ఈ రేంజ్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..

Skanda 1st trp : బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలయికలో వచ్చిన మూవీ 'స్కంద'. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో ఇరగదీస్తోన్న ఈ మూవీ.. రీసెంట్‌గా ప్రముఖ ఛానెల్‌లో టెలికాస్ట్ అయింది. అక్కడ అదిరిపోయే టీర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2024, 11:19 AM IST
Skanda: మైండ్ బ్లాంక్ చేస్తోన్న స్కంద మూవీ మూవీ ఫప్ట్ టీఆర్పీ.. ఈ రేంజ్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..

Skanda - Ram pothineni - boyapati Sreenu: యంగ్ డైనమిక్ హీరో రామ్ కథానాయకుడిగా.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'స్కంద'. ఈ మూవీ గతేడాది విడుదలై మాస్ ప్రేక్షకుల్లో ఓ వర్గం వారిని మెప్పించింది. రామ్ పోతినినే, బోయపాటి శ్రీను వారికి అదనంగా శ్రీలీల తోడు కావడంతో ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించాయి.

ఈ మూవీని బోయపాటి శ్రీను మాస్ ప్రేక్షకులకు అలరించాలనే ఉద్దేశ్యంతో లాజిక్‌కు కిలో మీటర్ దూరంలో స్కంద మూవీని తెరకెక్కించాడు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓ సామాన్యుడు ఎలా చెడుగుడు ఆడుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు రామ్ వంటి మిల్కీ బాయ్ చేతిలో కట్టి పట్టించి ఎంతో మందిని నరికించాడో లెక్క ఉండదు.

పూర్తి వైలెంట్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాదు అఔ యావరేజ్‌గా నిలిచి నిర్మాతకు ఒకింత నష్టాలను నుంచి గట్టెక్కించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ ఈ మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమా స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా  ప్రసారమైతే.. మొదటి టెలికాస్ట్‌లో8.47 టీర్పీ రేటింగ్ సాధించింది. ఒక రకంగా ఫ్యామిలీ ఆడియన్సకు దూరంగా తెరకెక్కిన ఈ మూవీ మొదటిసారి టెలివిజన్‌లో టెలికాస్ట్ అయినపుడు ఈ రేంజ్ రేటింగ్ సాధించిండం మాములు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. ఓ రకంగా యావరేజ్ మూవీకి ఇది మంచి టీఆర్పీ అనే చెప్పాలి.

ప్రస్తుతం రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ కెరీర్‌లో తొలి సీక్వెల్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ శివరాత్రి కానుకగా మార్చిలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read: YS Sharmila Security: చెల్లెమ్మకు భద్రత పెంచిన జగన్‌ అన్నయ్య.. 2+2 భద్రత పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News