Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్'గా హీరో నాని మెప్పించాడా?

Shyam Singha Roy Review: దాదాపుగా రెండేళ్ల తర్వాత 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించారు నేచురల్ స్టార్ నాని. ఆయన నటించిన ఈ చిత్రం నేడు (డిసెంబరు 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం రాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 09:07 AM IST
    • నేడు (డిసెంబరు 24) థియేటర్లలో విడుదలైన 'శ్యామ్ సింగరాయ్'
    • దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్లకు వచ్చిన హీరో నాని
    • ప్రీమియర్ షోస్ ను సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్
Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్'గా హీరో నాని మెప్పించాడా?

Shyam Singha Roy Review: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలో నాని..  వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

సూపర్ హిట్ అందుకున్నాడా?

కరోనా సంక్షోభం కారణంగా నాని నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన 'వి', 'టక్ జగదీష్' సినిమాలు మంచి టాక్ సంపాదించుకోగా.. ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి సూపర్ హిట్ అందుకోవడానికి నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ మంచి టాక్ సంపాదించుకుంది. నాని, సాయి పల్లవి జోడి ఈ సినిమాలో హైలేట్ అని.. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాకు మరో హైలెట్ అంటున్నారు. ఈ సినిమాతో నాని సూపర్ హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నారు.

మరోవైపు రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయిందట. సినిమాలోని మొదటి భాగం కొంచెం స్లోగా ఉందని, క్లైమాక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. రెండేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చిన నాని.. హిట్‌ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్‌ చేశారు.  

 

Also Read: Sushmita Sen Breakup: 'మా బంధం ముగిసింది': రోహ్మన్ తో బ్రేకప్ పై మాజీ విశ్వసుందరి క్లారిటీ

Also Read: Nora Fatehi Car Accident: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. నటి పరిస్థితి ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News