Shruthi Hassan: 'వాల్తేరు వీరయ్య'కి జ్వరమంటూ హ్యాండిచ్చి బాలయ్య షోకి శ్రుతి హాసన్?

Shruthi Hassan attended Unstoppable With NBK shoot: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనారోగ్యం పేరుతొ హ్యాండిచ్చిన శృతి హాసన్ ఇప్పుడు బాలకృష్ణ షో షూటింగ్ లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 9, 2023, 08:56 PM IST
Shruthi Hassan: 'వాల్తేరు వీరయ్య'కి జ్వరమంటూ హ్యాండిచ్చి బాలయ్య షోకి శ్రుతి హాసన్?

Shruthi Hassan Missed Waltair Veerayya Event But attended Unstoppable With NBK shoot: ఈ సారి సంక్రాంతికి రెండు తెలుగు హీరోల పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్గా నటించడమే. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది.

విశాఖపట్నంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతిహాసన్ డుమ్మా కొట్టింది. అంతేకాక తనకు ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల విశాఖపట్నం రాలేకపోయానని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ఆమె గురించి ప్రస్తావిస్తూ ఆమెను ఎవరు బెదిరించారో తెలియదు కానీ రాలేకపోయింది అంటూ చిరంజీవి సెటైర్లు వేశారు. అంతకు రెండు రోజులు ముందే నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ఈవెంట్ కు శృతిహాసన్ హాజరు కావడంతో చిరంజీవి బాలకృష్ణ గురించి ఇలా కామెంట్ చేసి ఉంటారని అందరూ భావించారు.

అక్కడి వరకు బాగానే ఉంది కానీ నిన్న జ్వరం వచ్చి హోటల్ రూమ్ కి పరిమితం అయ్యానని చెప్పుకొచ్చిన ఆమె ఈరోజు హైదరాబాదులో జరిగిన అన్ స్టాపబుల్ వీర సింహారెడ్డి స్పెషల్ ప్రమోషనల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నది. హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ స్టూడియోలో జరిగిన ఈ షూటింగ్ లో గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ వంటి వారితో కలిసి ఆమె అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షూటింగ్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో మెగా అభిమానులు ఆమె మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ షో షూటింగ్ కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి ఏమి ఇబ్బంది అంటూ ఆమె మీద సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ అంశం మీద శృతిహాసన్ ఎలా స్పందిస్తుంది? అనేది వేచి చూడాల్సి ఉంది. 

Also Read: Shaakuntalam: శాకుంతలం ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అయితే ఆర్సీ 15 ఏంటి?

Also Read: Actress Sudha: ‘వందల కోట్లు పోయి ఒంటరయ్యా.. నా వాళ్ళు నన్ను వదిలేశారన్న నటి సుధ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News