Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్

Waltair Veerayya Song Shoot వాల్తేరు వీరయ్య సినిమాలో సాంగ్ షూటింగ్‌ కోసం టీం అంతా కూడా విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందే. ఈ మేరకు అక్కడి అందాలను చిరంజీవి ప్రత్యేకంగా బంధించి చూపించిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 07:08 AM IST
  • విదేశాల్లో వాల్తేరు వీరయ్య టీం
  • చిరుతో శ్రుతి హాసన్ రొమాన్స్
  • మిడ్ ఫింగర్ చూపించిన హీరోయిన్
Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్

Shruthi Haasan Shows Middle Finger శ్రుతి హాసన్ ప్రస్తుతం చిరంజీవితో విదేశాలకు చెక్కేసింది. అక్కడ వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ కోసం మకాం పెట్టేసింది. గడ్డ కట్టే మంచులో సాంగ్‌ షూట్ చేశామని, అందమైన లొకేషన్లలో సాంగ్‌ షూట్ చేశామని చిరంజీవి నిన్న ఓ లీక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి మంచు లోయలు చూపిస్తూ సాంగ్ బీట్ ఎలా ఉంటుందో కూడా చిన్నగా లీక్ ఇచ్చాడు. సాంగ్ బీట్ అయితే బాగానే అనిపించింది. నువ్ శ్రీదేవీ అయితే.. నేను చిరంజీవిని అంటూ సాగే ఈ పాట బాగుందనే అనిపిస్తోంది.

మొత్తానికి ఈ సాంగ్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. బాగానే వచ్చిందన్నట్టుగా చిరు తెలిపాడు. ఇక తాజాగా శ్రుతి హాసన్ మాత్రం కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఓ ఫోటోలో ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తూ కనిపించింది. ఆ ఫోటోలను క్యాస్టూడ్ డిజైనర్ నీరజ కోన తీస్తూ వచ్చింది. మరి ఎందుకు అలా మిడిల్ ఫింగర్ చూపించింది? ఏం జరిగింది? అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

కానీ ఈ పోస్టులో శ్రుతీ హాసన్ ఎంతో సరదాగా ఉంది. చిన్న పిల్లలు తిన్నట్టుగా నాకి నాకి తీనేస్తోంది. ఇంత మాస్‌గా తింటున్నాను కదా? అంటూ శ్రుతీ హాసన్ తమిళ్లో ఏదో చెప్పేసింది. వేస్ట్ చేయొద్దు కదా? అని చెప్పేసింది. ఇప్పుడు శ్రుతీ హాసన్ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఎటు చూసినా శ్రుతి హాసన్‌కు ఈ సంక్రాంతి కలిసి వచ్చేలానే ఉంది.

అటు బాలయ్య వీర సింహా రెడ్డిలోనూ, ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా మళ్లీ తెలుగులో శ్రుతి హాసన్ హవా మొదలైనట్టే. మరి ఈ సంక్రాంతికి ఏం జరుగుతుందో చూడాలి

Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

Also Read : Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News