Shrihan Not Deserves As Winner : బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి ఘటన ఎదురవుతుంది.. దాని వల్ల తీసుకునే నిర్ణయాలతో ఇమేజ్ ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్క సంఘటనతో కంటెస్టెంట్ల పూర్తి గ్రాఫ్ మారుతుంది. ఇంత వరకు శ్రీహాన్ ఎక్కడా సరిగ్గా ఎక్స్‌పోజ్ కాలేదు. ఇంత వరకు శ్రీహాన్ ఇనయ గొడవ మాత్రమే హైలెట్ అయింది. ఇనయ విషయంలో గొడవలు పెట్టుకోవడం, వాదించుకోవడం తప్పా ఇంకేం చేయలేదు శ్రీహాన్. ఎవరి కోసమూ ఎప్పుడూ కూడా స్టాండ్ తీసుకోలేదు. ధైర్యంగా తన నిర్ణయాన్ని బయటపెట్టలేదు.
ఇదే శ్రీహాన్ విషయంలో వచ్చిన సమస్య. ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తాడు.. ఆటలు బాగానే ఆడతాడు. అందరిలో కలిసి మెలిసి ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పుని తప్పు అని చెప్పి.. నిజం వైపు నిలబడే ధైర్యం లేదు. దీంతో శ్రీహాన్ విజేతగా అనర్హుడని అంతా అనుకుంటూ ఉండేవారు. కానీ తాజాగా ఆ విషయాన్ని తనంతట తానే నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారంలో కెప్టెన్ అయ్యాడు.
చేపల చెరువు టాస్కులో గీతూ అష్టదరిద్రంగా ఆడేసిందని, నీ ఆట నువ్వు ఆడుకో.. ఎలా ఆడించాలో బిగ్ బాస్ టీంకు తెలుసు.. బొచ్చులో ఆట అంటూ నానా రకాలుగా తిట్టిపోసేశాడు నాగార్జున. అయితే ఇంత తిట్టి ఇంత చేసినా కూడా శ్రీహాన్ అసలు విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఈ వారంలో ది వరెస్ట్ ఆఫ్ వరెస్ట్ కంటెస్టెంట్ గీతూ అని, గీతూ దరిద్రంగా ఆడిందంటూ నాగార్జున స్టేజ్ మీద అంత సేపు క్లాస్ పీకాడు. కానీ చివరకు అనర్హులు బ్యాడ్జ్, రోటెన్ ఫిష్ బ్యాడ్జ్‌ను తగిలించమని కెప్టెన్ అయిన శ్రీహాన్‌ను నాగార్జున ఆదేశించాడు.
గీతూకే ఆ బ్యాడ్జ్ పెడతాడని అందరూ అనుకున్నారు. కానీ శ్రీహాన్ మాత్రం తన పిరికితనాన్ని బయటపెట్టేశాడు. గీతూకి భయపడ్డాడో, స్నేహితురాలని వదిలేశాడో గానీ.. అమాయకురాలు, ఎక్కువ మాట్లాడలేదనో కీర్తి మీదకు తోసేశాడు. ఆమెకు ఆ రోటెన్ ఫిష్ ఇచ్చాడు.ఇక్కడే కెప్టెన్‌గా శ్రీహాన్ ఫెయిల్ అయ్యాడు. కనీసం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా నిరూపించుకోలేకపోయాడు. దీంతో ఇతను విన్నర్ అయ్యే సత్తా ఉన్న కంటెస్టెంటేనా? అనే అనుమానం వచ్చేలా చేశాడు. ఇలా ఉంటే శ్రీహాన్.. కచ్చితంగా కూడా విన్నర్ అవ్వలేడు. టాప్ 5 వరకు అయితే చేరుతాడేమో గానీ టైటిల్ మాత్రం కొట్టలేడు.
Also Read : Ram Charan Cooking : వెకేషన్లో వంటా వార్పు.. రామ్ చరణ్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook