Vijay Devarakonda: ఖుషీ మీదే విజయ్ దేవరకొండ ఫోకస్..మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది?

Vijay Devarakonda Fans: సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 2, 2023, 05:11 PM IST
Vijay Devarakonda: ఖుషీ మీదే విజయ్ దేవరకొండ ఫోకస్..మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది?

Shocking News to Vijay Devarakonda Fans: రంగస్థలం సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ పుష్ప సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా చేసిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అయితే ఈ పుష్ప సినిమా అనౌన్స్ చేసి రిలీజ్ చేయడానికి మధ్యలో సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ ప్రకటన వచ్చినప్పుడు అందరిలోనూ ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి నెలకొంది. దానికి తగినట్టుగానే పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంచనాలు వేశారు. అయితే పుష్ప సినిమా మొదటి భాగం ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద సుకుమార్ దృష్టి పెట్టాల్సి వచ్చింది. అలా మొదటి భాగానికి కేటాయించిన సమయం కంటే రెండో భాగానికి ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు స్వయంగా డబ్బులు కూడా పెట్టాల్సి వస్తున్న క్రమంలో ఈ విషయం మీద సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నిజానికి సుకుమార్, విజయ్ దేవరకొండ తో ప్రాజెక్టు ఎనౌన్స్ చేసే నాటికి పుష్ప రెండో భాగం మీద ఆయనకు పెద్దగా అంచనాలు లేవట. పుష్ప మొదటి భాగం పూర్తయిన వెంటనే సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక లవ్ స్టోరీ చేసి రిలీజ్ చేయాలని భావించారు. ఆ తర్వాత పుష్ప రెండు భాగాలుగా మారడం మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు సుకుమార్ చిన్న బడ్జెట్లో విజయ్ దేవరకొండతో చేయాలనుకున్న లవ్ స్టోరీ చేయాలని భావించడం లేదట.

ఈ సినిమాని పక్కన పెట్టేసిన సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ హీరోగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుకుమార్ విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ దాదాపుగా క్యాన్సిల్ అయింది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. నిజానికి లైగర్ లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ సరైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి సినిమాతో మంచి హిట్ అందుకుంటాడని అంచనాలు ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ క్యాన్సిల్ అవ్వడం మాత్రం ఫాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read: Shreya Dhanwanthary Photos: మొన్న ఏమీ లేకుండా.. ఇప్పుడు అదొక్కటే ధరించి హైదరాబాదీ బ్యూటీ రచ్చ!

Also Read: Samantha Saree Photo: ప్రియుడితో శకుంతల.. ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గని సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News