Mohan Babu: మోహన్​బాబు సంచలన నిర్ణయం.. ట్రోలర్స్​, మీమర్స్ కు లీగల్ నోటీసులు!

Mohan Babu: సీనియర్ నటుడు మోహన్​బాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్​ తెగ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఆయా పేజీలకు మోహన్​బాబు లీగల్ నోటీసులు పంపించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 06:05 PM IST
Mohan Babu: మోహన్​బాబు సంచలన నిర్ణయం.. ట్రోలర్స్​, మీమర్స్ కు లీగల్ నోటీసులు!

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్​బాబు ఇటీవల '‘సన్ ఆఫ్ ఇండియా' (Son of india) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే విడుదలకు ముందే నుంచే ఈ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మోహన్​బాబుతో పాటు ఆయన కుటుంబంపై తెగ ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో మోహన్​బాబు (Mohan Babu) సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సదర్ మీమ్ పేజీల అడ్మిన్​లకు లీగల్​ నోటీసులు పంపించి..షాకిచ్చారు. అదేవిధంగా రూ.10కోట్లు దావా కూడా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ట్రోల్స్, మీమ్స్ తనను ఎంతో బాధపెడుతున్నాయని గతంలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇద్దరు హీరోలు వెనుకండి ఇదంతా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ హీరోలు ఎవరో తనకు తెలుసునన్న ఆయన.. ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అన్నారు. టాలీవుడ్ పై ఇటీవల మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబం అంటూనే.. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 

Also Read: Thalapathy Vijay apology: వారికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News