Saranga Dariya song controversy కి ఫుల్‌స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల

Sekhar Kammula about Saranga Dariya song controversy: సారంగ దరియా పాట వివాదం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చర్చనియాంశమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ స్టోరీ మూవీ కోసం ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అభ్యర్థన మేరకు ప్రముఖ సుద్దాల అశోక్ తేజ రచన సహాయం చేయగా ఈమధ్యే ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంటున్న Singer Mangli ఆ పాటను పాడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2021, 12:28 AM IST
  • సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చనియాంశమైన సారంగ దరియా పాట వివాదం.
  • Saranga dariya song కి అసలు యజమాని ఎవరు అనే అంశంపై అనేక సందేహాలు.
  • వివాదంలో హైలైట్ అయిన కోమలి, శిరీష, సుద్దాల అశోక్ తేజ, దర్శకుడు శేఖర్ కమ్ముల, సింగర్ మంగ్లీ పేర్లు.
  • అసలు ఈ పాటను ఎందుకు తీసుకోవాలనుకున్నాడు, ఎలా వివాదానికి చెక్ పెడుతున్నాడో చెప్పిన దర్శకుడు శేఖర్ కమ్ముల.
Saranga Dariya song controversy కి ఫుల్‌స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల

Sekhar Kammula about Saranga Dariya song controversy: సారంగ దరియా పాట వివాదం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చర్చనియాంశమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ స్టోరీ మూవీ కోసం ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అభ్యర్థన మేరకు ప్రముఖ సుద్దాల అశోక్ తేజ రచన సహాయం చేయగా ఈమధ్యే ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంటున్న Singer Mangli ఆ పాటను పాడింది. మంగ్లి పాడిన సారంగ దరియ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా... వైరల్‌గా మారిన ఆ పాటను చూసి Saranga dariya song పై సర్వహక్కులు తమకే ఉన్నాయంటూ మరో ఇద్దరు సింగర్స్ తెరపైకొచ్చారు. తమకే సొంతమైన ఈ పాటను, తమ కారణంగానే ఎంతో ఫేమస్ అయిన ఈ పాటను మరెవరి చేతో పాడించడం ఒక తప్పు అయితే, ఆ పాటకు Lyricist Suddala Ashok Teja క్రెడిట్ కొట్టేయడం మరో తప్పు అంటూ ఆ ఇద్దరు సింగర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 

Saranga dariya song controversy చేసిన ఆ ఇద్దరు సింగర్స్ ఎవరో కాదు.. మొట్టమొదటిసారిగా ఆ పాటను ఓ టీవీ షోలో పాడిన పల్లెటూరి జానపదగాయని Singer Komali అయితే, ఆమెలాగే అదే పాటను ఆ తర్వాత మరో టీవీ షోలో పాడిన మరో జానపద గాయని Singer Shirisha. 

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సారంగ దరియ సాంగ్ వివాదంపై Love story director Sekhar Kammula స్పందిస్తూ ఓ టీవీ షోలో శిరీష అనే సింగర్ నోట తొలిసారిగా ఆ పాట విన్నానని, ఆ పాటను లవ్ స్టోరీ మువీలో పెట్టాలనే ఉద్దేశంతో లాక్ డౌన్ సమయంలోనే ఆమెను సంప్రదించగా అప్పుడు ఆమె ప్రెగ్నెన్సీతో ఉండటంతో ఆమె ఆ పాట పాడేందుకు కుదరలేదని చెప్పుకొచ్చాడు. 

Also read : Hari Hara Veeramallu first look: హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ వీడియో వైరల్

ఆ తర్వాత మరో సింగర్ చేత ఈ పాటను పాడించి ఆ పాటపై చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరిలో సారంగ దరియ పాటను రికార్డ్ చేసేటప్పుడు మరోసారి శిరీషను సంప్రదించగా.. అప్పటికీ కొద్దిరోజుల క్రితమే డెలివరీ అయిన కారణంగా ఆమె మళ్లీ కుదరలేదు. దీంతో తాము మంగ్లితో సారంగ దరియ పాట పాడించాం. అయితే, అప్పటివరకు తమకు ఈ పాట తొలిసారిగా పాడింది కోమలి అనే విషయం తెలియదు. సారంగ దరియ సాంగ్ ప్రోమో బయటికొచ్చాకే కోమలి గురించి తెలిసింది. ఆ తర్వాత తమ లవ్ స్టోరీ మూవీ యూనిట్ వాళ్లు కోమలిని సంప్రదించారు అని శేఖర్ కమ్ముల తెలిపాడు. 

ఏదేమైనా కోమలికి ఆర్థిక సహాయం చేస్తాం అని ప్రకటించిన శేఖర్ కమ్ముల.. కోమలికి, శిరీషకు సినిమాలో క్రెడిట్ ఇస్తామని స్పష్టంచేశాడు. అంతేకాకుండా సింగర్ కోమలికి సారంగ దరియ పాటను Love story pre-release event లో పాడేందుకు అవకాశం ఇవ్వగా అందుకు ఆమె అంగీకరించినట్టుగానూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు. మొత్తానికి Saranga dariya song controversy కి శేఖర్ కమ్ముల అలా చెక్ పెట్టాడన్నమాట. శేఖర్ కమ్ముల ఇచ్చిన ఈ ఆఫర్ Suddala Ashok Teja పై కోమలికి వచ్చిన కోపం పోయేలా చేస్తుందో లేదో వేచిచూడాల్సిందే మరి.

Also read : Saranga Dariya Song Dispute: సారంగ దరియా పాట చుట్టూ వివాదం, పాటకు అసలు ఓనర్ ఎవరు మరి

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ మూవీలో Naga Chaitanya, Actress Sai Pallavi జంటగా నటించగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ Pawan CH మ్యూజిక్ కంపోజ్ చేశాడు. వచ్చే నెల్లో Love story movie release కానుంది. ఏదేమైనా Saranga dariya song controversy తో సినిమాకు కూడా భారీ పబ్లిసిటీ వచ్చి పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News