Sekhar Kammula: రూట్ మార్చుకుంటున్న శేఖర్ కమ్ముల…ఇకమీదట ఆ సినిమాలు తీయరా!

Sekhar Kammula Films: ఫీల్ గుడ్ మూవీస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు శేఖర్ కమ్ముల. కమర్షియల్ ఫార్మేట్లో కాకుండా.. ప్రేమను అలానే తన సినిమాల్లో హీరోయిన్స్ ను ఎంతో చక్కగా చూపిస్తూ.. తెలుగు ప్రేక్షకులకు క్లాసిక్ సినిమాలు అందించారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 04:20 PM IST
Sekhar Kammula: రూట్ మార్చుకుంటున్న శేఖర్ కమ్ముల…ఇకమీదట ఆ సినిమాలు తీయరా!

Leader 2: శేఖర్ కమ్ముల.. 2000 సంవత్సరం డాలర్ డ్రీమ్స్ అనే మూవీతో ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2004 ఓ మంచి కాఫీలాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక అదే తరహాలో గోదావరి సినిమా తీసి విమర్శకుల దగ్గర కూడా ప్రశంసలు పొందాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలు కొన్ని అయినప్పటికీ క్వాలిటీ ఉన్న డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని చిత్రాలలో స్పెషాలిటీ ఆడవారికి సంబంధించి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించడం.

హీరో ఓరియంటెడ్ సినిమాలకు కాస్త భిన్నంగా.. హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూపించే దర్శకులలో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. హీరోయిన్ అంటే కేవలం హీరో వెనక బైక్ ఎక్కడం.. డాన్సులు వేయడం కాదు.. తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది అనే పాయింట్ని బాగా హైలైట్ చేసే డైరెక్టర్స్ లో శేఖర్ టాప్. ఇతని సినిమాల్లో హీరోయిన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి శేఖర్.. దగ్గుబాటి రానా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన లీడర్ సినిమా విషయంలో కాస్త హీరో ఓరియంటెడ్ గా కంటెంట్ ని మార్చారు.

ఇందులో రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన కల్పించడమే కాకుండా సమాజంలో పాతుకుపోయిన మంత్రుల అవినీతిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ మూవీలో ఎత్తులు.. పై ఎత్తులు ..అన్నిటికీ మించి డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. లీడర్ మూవీ ముందు వరకు శేఖర్ కమ్ముల చిత్రాలు అంటే.. యూత్ ఎంటర్టైనర్స్ ఆనంద్, గోదావరి.. హ్యాపీడేస్ లాంటివి గుర్తుకు వచ్చేవి. అయితే లీడర్ సినిమాతో ఆ లెక్కలన్నీ మారిపోయాయి. అంతేకాదు అంతకుముందు అన్ని సినిమాలలో శేఖర్ కమ్ముల హీరోయిన్స్ హైలెట్ అయితే లీడర్ చిత్రంలో మాత్రం హీరో హైలైట్ అయ్యాడు.

బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఎప్పటినుంచో మూవీకి సీక్వెల్ కావాలి అని సినీ లవర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కాంబోలో ఓ మల్టీస్టారర్ మూవీ ని తీసే పనిలో శేఖర్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లీడర్ 2 సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెర మీదకు వచ్చింది.

ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తలెత్తినటువంటి రాజకీయ పరిస్థితులు.. రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని లీడర్ 2 సినిమాకు సంబంధించిన స్టోరీ డెవలప్ చేస్తున్నారట శేఖర్ కమ్ముల. అయితే ఈ మూవీలో హీరోగా రానానే కొనసాగుతాడా లేక కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తాడా అన్న విషయం పై క్లారిటీ లేదు. లీడర్ మూవీ తర్వాత ఇదే తరహాలో రానా నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని చేశాడు. రానా నటిస్తున్న రాక్షస రాజు మూవీ కూడా ఇంచుమించు ఇదే నేపథ్యంలో సాగుతుంది. అందుకే మళ్ళీ ఈ చిత్రంలో శేఖర్ రానా అని తీసుకుంటారా మరో హీరోని తీసుకుంటారా అనే సందేహాలు ఉన్నాయి.

ధనుష్ నాగార్జున మూవీ పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరం సులభంగా పడుతుంది. ఆ తర్వాత లీడర్ 2 పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూసి ఆయన అభిమానులు శేఖర్ తన చిత్రాలను తెరకెక్కించే విధానంలో కాస్త మార్పు కనిపిస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శేఖర్ కమ్ముల అంటే మనకు గుర్తొచ్చేది ప్రేమ కథ లేదా హీరోయిన్ ని ఎంతో ఉన్నతంగా చూపించే సినిమాలు. అలాంటి శేఖర్ కమ్ముల ఇప్పుడు హీరో ఓరియెంటెడ్ సినిమాలు చేసే వైపు మగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది.

మరి ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత అతను కూడా రెగ్యులర్ డైరెక్టర్స్ లాగా హీరో ఓరియంటెడ్ సినిమాలో తీస్తాడా? లేక ఆనంద, గోదావరిలో హీరోయిన్స్ లాగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని కంటిన్యూ చేస్తాడా చూడాలి.

Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

Also read: Ayodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే...

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News